TTD key Decisions: తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.

Tirumala TTD (photo-TTD)

Tirumala, Nov 18: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సోమవారం(నవంబర్‌18) సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు పలు నిర్ణయాలను పాలకమండలి ఆమోదించింది.శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చే సొమ్ముని టీటీడీ అకౌంట్‌లోనే జమ అయ్యేలా నిర్ణయం తీసుకుంది.

దీంతో పాటు సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు (BR Naidu) అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సమావేశం వివరాలను బీఆర్‌ నాయుడు మీడియాకు వెల్లడించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు

శ్రీనివాస సేతు పైవంతెనకు గరుడ వారధిగా నామకరణం చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తిరుమల డంపింగ్‌ యార్డులోని చెత్తను 3 నెలల్లో తొలగిస్తాం. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రైవేటు బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తాం. శారదాపీఠం లీజును రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం. పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతులు రద్దు చేస్తున్నాం. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తాం’’ అని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.

అన్నదానంలో నూతనంగా మరో ఐటమ్‌ని భక్తులకు వడ్డించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. శ్రీవారి ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యి వినియోగించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. టీటీడీ ఉద్యోగులకు ఇస్తున్న బ్రహ్మోత్సవ బహుమానాన్ని రూ.14 వేల నుంచి రూ.15,400లకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. టూరిజం శాఖకు కేటాయిస్తున్న 4 వేల ఎస్ఈడీ టిక్కెట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif