CM Uddhav Receives Threat Call: సీఎం ఇంటిని పేల్చేస్తాం, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాకరే నివాసం మాతోశ్రీని పేల్చేస్తామంటూ నాలుగు ఫోన్ బెదిరింపు కాల్స్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు

అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరుతో (Dawood Gang Member) ఈ కాల్స్‌ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి (Matoshree Residence) బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు సమాచారం. దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం ఇంటిలో ల్యాండ్‌ఫోన్‌ నుంచి ఈ బెదిరింపు కాల్స్‌ వచ్చాయని చెబుతున్నారు. అండర్‌వరల్డ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు

Maharashtra CM and Shiv Sena chief Uddhav Thackeray (File Photo| PTI)

Mumbai, September 6: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే నివాసం ‘మాతోశ్రీ’ని దగ్ధం చేస్తామని మహారాష్ట్ర సీఎంకు బెదిరింపు కాల్స్‌ (Uddhav Thackeray Receives Threat Call) వచ్చాయి. అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం పేరుతో (Dawood Gang Member) ఈ కాల్స్‌ వచ్చాయి. బాంద్రాలోని ముఖ్యమంత్రి నివాసానికి (Matoshree Residence) బెదిరింపు కాల్స్‌ వచ్చినట్టు సమాచారం. దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం ఇంటిలో ల్యాండ్‌ఫోన్‌ నుంచి ఈ బెదిరింపు కాల్స్‌ వచ్చాయని చెబుతున్నారు. అండర్‌వరల్డ్‌ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు

దుబాయ్ నుంచి మొత్తం నాలుగు బెదిరింపు కాల్స్ వచ్చాయంటున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర కేబినెట్ మంత్రి అనిల్ పరాబ్ ధృవీకరించారు. ఫోన్ చేసిన వ్యక్తి తాను దావూద్ ఇబ్రహీం యొక్క పనిమనిషి అని, ముఖ్యమంత్రితో మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పాడని తెలిపారు. ముఖ్యమంత్రి ఇంటికి కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతమున్న భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కాల్ రావడం వెనుక ప్రత్యేక కారణం ఏమైనా ఉంటుందా అని పోలీసులు విచారిస్తున్నారు. కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముంబై పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర సంస్థలను కూడా హై అలర్ట్ చేశారు.

Reports of Threats Given to Uddhav Thackeray to Blow up His Residence:  

రానున్న మూడు నెలలు సీఎం ఉద్దవ్ థాకరే

రానున్న మూడు నెలల్లో రాష్ట్రంలో కరోనా మరింత విజృంభించే అవకాశముందని, పరిస్థితిని ఎదుర్కొవడం సవాళేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కరోనా పరిస్థితిపై శనివారం సాయంత్రం ఆయన అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు రోజులుగా రాష్ట్రంలో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదుకావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘గతంలో రోజుకు 1000 నుంచి 1100 కేసులే అధికంగా భావించాం. రెండు రోజులుగా 1700 నుంచి 1900 వరకు నమోదువుతున్నాయి.

ముంబై ఓ మినీ పాకిస్తాన్, కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు, ఆమె ఓ మెంటల్ కేసు అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్, ముదురుతున్న వివాదం

పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికలతో సిద్ధం కావాలి’ అని అధికారులకు సూచించారు. ముంబైలో అదనంగా మరో 6 వేల పడకలు ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్, ఐసీయూ సౌకర్యాలు పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పారు. కోలుకున్న వ్యక్తుల్లో కొన్ని దుష్ప్రభావాలు కనిపించాయి. దేని వల్ల ఇవి వస్తున్నాయో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు.