Udhayanidhi Stalin: త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎంగా ఉద‌య‌నిధి స్టాలిన్, రేపే ప్ర‌మాణ‌స్వీకారం, సెంథిల్ బాలాజీకి మ‌ళ్లీ కేబినెట్ బెర్త్

అందరూ ఊహించిన విధంగానే డీఎంకే అధినేత స్టాలిన్‌ తన తనయుడు ఉదయనిధికి (Udhayanidhi Stalin) డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం కూర్పుపై స్టాలిన్‌ గవర్నర్‌కు లేఖ రాశారు.

MK Stalin with son Udhayanidhi Stalin. | Udhayanidhi Stalin/ Facebook

Chennai, SEP 29: తమిళనాడు కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ సోమవారం జరుగనున్నది. అందరూ ఊహించిన విధంగానే డీఎంకే అధినేత స్టాలిన్‌ తన తనయుడు ఉదయనిధికి (Udhayanidhi Stalin) డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం కూర్పుపై స్టాలిన్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులను పక్కనపెట్టారు. వారి స్థానంలో నలుగురిని మంత్రులుగా తీసుకోనున్నారు. ఇందులో ఇద్దరు కొత్త ముఖాలకు చోటు కల్పించారు. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్‌ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మంత్రులుగా ఉన్న సెంజీ మస్తాన్‌, మనో తంగరాజ్‌, రామచంద్రన్‌లను తొలగించగా.. చెహియాన్, రాజేంద్రన్‌కు కొత్తగా బాధ్యతలు అప్పగించనున్నారు.

Tirupati Laddu Row: సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి 

సెంథిల్‌ బాలాజీ, నాజర్‌లకు మళ్లీ కేబినెట్‌ బెర్తులు కట్టబెట్టారు. అటవీశాఖను విద్యాశాఖ నుంచి పొన్ముడికి అప్పగించారు. పర్యావరణ మంత్రి మెయ్యనాథ్‌కు సంక్షేమశాఖను అప్పగించారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న పొన్ముడికి అటవీశాఖను అప్పగించారు. సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న రాజకన్నపన్‌కు డెయిరీశాఖ, అటవీశాఖ మంత్రి మతివేందన్‌కు ఆది ద్రవిడ సంక్షేమశాఖలను కేటాయిస్తూ నిర్ణయించారు. ద్రావిడ సంక్షేమశాఖ మంత్రిగా కొనసాగుతున్న కయల్విజికి మానవనరుల బాధ్యతలను ఇచ్చారు.

Anil Ambani Wins Rs 780 Crore: అనిల్ అంబానీకి కోర్టులో భారీ ఉరట, డివిసిపై రూ. 780 కోట్ల కేసును గెలిచిన అనిల్ అంబానీ 

స్టాలిన్‌ (Stalin) ప్రస్తుత కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. స్టాలిన్‌ కొత్తగా పంచాయతీ సమావేశాలను విజయవంతంగా అమలు చేశారు. 2019లో స్టాలిన్‌ ఉదయనిధిని యూత్‌ సెక్రెటరీ బాధ్యతలు అప్పగించారు. ఆ సమయంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉన్నది. స్టాలిన్‌ ప్రజాసేవలో చురుగ్గా పాల్గొన్నారు. వివిధ నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఉదయనిధి పోటీ చేశారు. తిరువల్లికేణి-చేపాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఆ సమయంలో ఉదయనిధి మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. 2022లో కేబినెట్‌ విస్తరణలో మంత్రి పదవిని కేటాయించారు. యువజన సంక్షేమం, క్రీడాశాఖల బాధ్యతల అప్పగించారు. గతకొంతకాలంగా డిప్యూటీ సీఎంగా ప్రమోట్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఊహించిన విధంగానే స్టాలిన్‌ తన తనయుడికి డిప్యూటీ సీఎంగా నియమించారు. సోమవారం జరిగే కార్యక్రమంలో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు.



సంబంధిత వార్తలు

SC on Private Properties: ఆర్టికల్ 39(బి) ప్రకారం అన్ని ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు, ప్రైవేటు ఆస్తులపై ప్రభుత్వ హక్కుల అంశంపై సుప్రీంకోర్ట్ కీలక తీర్పు

Tamil Nadu Horror: తమిళనాడులో దారుణం, శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు, వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నించడంతోనే హత్య..

Ex Minister Reddi Satyanarayana Passed Away: మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ కన్నుమూత.. అనారోగ్య కారణలతో మృతి.. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా గుర్తింపు

EAM S Jaishankar Comments: భార‌త విదేశాంగ విధానంపై కేంద్ర‌మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు, ప‌దేళ్లలో ఎంతో మారిపోయింద‌న్న జైశంక‌ర్, కెనడాతో స్నేహంపై ఏమ‌న్నారంటే?