Bifurcation Issues Row: ఈ సమావేశంలోనైనా కొలిక్కి వస్తాయా, తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ కీలక భేటీ, హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు ఆహ్వానం
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలపై (pending bifurcation issues) కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ సమావేశానికి (Union Home Ministry’s meeting) హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల (Telangana and Andhra Pradesh ) సీఎస్‌లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులకు ఆహ్వానం పంపింది.
Hyd, Sep 13: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా పరిష్కారం కాని విభజన సమస్యలపై (pending bifurcation issues) కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ సమావేశానికి (Union Home Ministry’s meeting) హాజరుకావాలని తెలుగు రాష్ట్రాల (Telangana and Andhra Pradesh ) సీఎస్‌లతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ సహా వివిధశాఖల అధికారులకు ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారంపై చర్చించనున్నది.అలాగే విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై భేటీలో చర్చించనున్నారు.
సమావేశానికి సంబంధించి ఎజెండాలో 14 అంశాలను చేర్చారు. షెడ్యూల్ 9లోని ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల విభజన, ఫైనాన్స్ కార్పొరేషన్లు, షెడ్యూల్ 9లో ప్రస్తావించిన సంస్థల పంపిణీపై చర్చ జరుగనున్నది. అలాగే 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థికపరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. సింగరేణి, ఏపీ హెవీ మెషనరి ఇంజినీరింగ్ నగదు, బ్యాంకు నిల్వలు, విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజెక్టులపై తీసుకున్న అప్పుల విభజన, రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఏపీకి ఇవ్వాలని నిధులు, సింగరేణి కాలరీస్, ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ తదితర అంశాలపై భేటీలో చర్చించనున్నారు.
సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోం శాఖ.. ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది.అయితే మూడు రాజధానులపై కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రస్తావించలేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ అజెండాలో పొందుపరిచింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కేంద్ర ఆర్థికశాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9శాఖల అధికారులను భేటీకి ఆహ్వానించారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు అజెండాలో పొందుపర్చారు. వీటితో పాటు సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌కు సంబంధించిన రెండు సంస్థలపై, పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరిగే అవకాశముంది.