Drugs. Image Used For Representational Purpose Only. (Photo Credits: Pixabay)

New Delhi, Sep 13: కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త అత్య‌వ‌స‌ర మందుల జాబితా లిస్టును విడుదల చేసింది. కాగా క్యాన్స‌ర్ కార‌క ఆందోళ‌న‌ల‌పై (cancer concerns) అత్య‌వ‌స‌ర మందుల జాబితా నుంచి యాంటాసిడ్ సాల్ట్ రానిటిడైన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గించింది. దీంతోపాటు 26 మందుల‌ను ఈ జాబితా నుంచి (Essential Medicines’ List) తొలగించింది. వీటిలో అసిలాక్‌, జినిటాక్‌, రాంటాక్ బ్రాండ్ల పేరుతో రానిటిడైన్‌ను (antac, Zinetac as antacid Ranitidine) ప్ర‌ముఖంగా విక్ర‌యిస్తున్నారు.ఇది సాధారణంగా అసిడిటీ, క‌డుపునొప్పి, గ్యాస్‌ సంబంధిత సమస్యలకు వాడుతుంటారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం నాడు 384 ఔషధాలను కలిగి ఉన్న కొత్త నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) ను విడుదల చేసింది. ఇంతలో, జాబితా నుండి తొలగించబడిన 26 మందులు దేశంలో ఉనికిలో ఉండవని తెలిపింది.

క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం, రాగల 48 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు

కాగా అత్య‌వ‌స‌ర మందుల జాబితా నుంచి దీనిని తొల‌గించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ డీసీజీఐ, ఎయిమ్స్‌ల‌తో విస్తృతంగా సంప్ర‌దింపులు జ‌రిపింది. ఇక నూత‌న అత్య‌వ‌స‌ర మందుల జాబితా వెల్ల‌డించ‌డంతో ఇన్సులిన్ గ్ల‌ర్గైన్ వంటి మ‌ధుమేహ ఔష‌ధాలు, డెల‌మ‌నిడ్ వంటి టీబీ ఔష‌ధాలు, ఐవ‌ర్‌మెక్టిన్ వంటి యాంటీపార‌సైట్ డ్ర‌గ్స్ ధ‌ర‌లు దిగిరానున్నాయి.

మినహాయించబడిన 26 ఔషధాలలో ఇవి ఉన్నాయి:

1. ఆల్టెప్లేస్

2. అటెనోలోల్

3. బ్లీచింగ్ పౌడర్

4. కాప్రోమైసిన్

5. సెట్రిమైడ్

6. క్లోర్ఫెనిరమైన్

7. డిలోక్సనైడ్ ఫ్యూరోయేట్

8. డిమెర్కాప్రోల్

9. ఎరిత్రోమైసిన్

10. ఇథినైల్స్ట్రాడియోల్

11. ఇథినైల్‌స్ట్రాడియోల్(A) నోరెథిస్టిరాన్ (B)

12. గాన్సిక్లోవిర్

13. కనామైసిన్

14. లామివుడిన్ (ఎ) + నెవిరాపైన్ (బి) + స్టావుడిన్ (సి)

15. లెఫ్లునోమైడ్

16. మిథైల్డోపా

17. నికోటినామైడ్

18. పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2a, పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా 2b

19. పెంటమిడిన్

20. ప్రిలోకైన్ (A) + లిగ్నోకైన్ (B)

21. ప్రోకార్బజైన్

22. రానిటిడిన్

23. రిఫాబుటిన్

24. స్టావుడిన్ (ఎ) + లామివుడిన్ (బి) 25. సుక్రాల్‌ఫేట్

26. వైట్ పెట్రోలేటం