New Delhi, Sep 13: బంగాళాఖాతంలో ఏర్పడి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, విదర్భపై ఉన్న వాయుగుండం సోమవారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మధ్యప్రదేశ్ మీదుగా వాయవ్య దిశగా కదులుతూ కొద్ది గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అల్పపీడన ప్రాంతం మీదుగా ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించింది.
ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ (weather department) మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో వెల్లడించింది.మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే 48 గంటల్లో భారీవర్షాలు((Heavy rainfall) కురుస్తాయని భారత వాతావరణశాఖ (India Meterological Department) తెలిపింది. ముంబయి(Mumbai) నగరంతోపాటు పలు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున(warned of heavy rainfall) లోతట్టుప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీపేర్కొంది. క్యుములోనింబస్ క్లౌడ్ ప్రభావం దేశంలో పలు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.
వీటి ప్రభావం వల్ల ఏపీ రాష్ట్రంపైకి నైరుతి గాలులు వీస్తున్నాయి.వీటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. మంగళవారం తీరం వెంబడి గంటకు 45–55.. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు ఈనెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిశాయి. చింతూరులో 4 సెంటీమీటర్లు, వీరఘట్టంలో 3.3, జియ్యమ్మవలసలో 3.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ముంబయి నగరంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ (yellow alert)జారీ చేసింది.సెప్టెంబరు 14 నుంచి 16వతేదీ వరకు మూడు రోజుల పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. డెహ్రాడూన్, చంపావత్, పిటోరాఘడ్, బాగేశ్వర్, నైనిటాల్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరంజ్ అలర్ట్(IMD orange alert) ప్రకటించారు.