bhadrachalam godavari

Hyd, Sep 12: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం (Godavari Floods) క్రమంగా పెరుగుతున్నది. మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర వరద 9 లక్షల క్యూసెక్కులు దాటింది. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు చేరింది. నదిలో 7,81,614 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. మరికొన్ని గంటల్లో వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి.

కాగా, గోదావరిలో వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న (Godavari Water Level Rises) నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిస్థితిని సమీకక్షించారు. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ (CM KCR) ఆదేశించారు. అధికారులను సన్నద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయంలో తక్షణమే కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

తీరం దాటిన వాయుగుండం, ఏపీకి భారీ వర్ష సూచన, ఈ నెల 17న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన అధికారులు

భద్రాచలం వద్ద సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక (Bhadrachalam on alert against floods) చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. తాజాగా మరోమారు భద్రాచలం వద్ద గోదావరికి వ‌ర‌ద పోటెత్తడంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు పదా అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి శ్రీశైలానికి 2,80,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,27,325 క్యూసెక్కుల వరద బయకు వెళ్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.90 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.