UP Road Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరు మంది మృతి, టీ స్టాల్‌లోకి దూసుకెళ్లిన ట్రక్కు, పలువురికి గాయాలు, డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదిన స్థానికులు, యూపీలో ఘటన
వేగంగా వచ్చిన ట్రక్కు టీ స్టాల్‌లోకి దూసుకెళ్లడంతో (Truck Rammed Into Tea Shop) ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను రక్షించి, ఆస్పత్రికు తరలించారు
Lucknow, Nov 2: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (UP Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు టీ స్టాల్‌లోకి దూసుకెళ్లడంతో (Truck Rammed Into Tea Shop) ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందగా.. పలువురు గాయపడ్డారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు డ్రైవర్‌ను పట్టుకొని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డ్రైవర్‌ను రక్షించి, ఆస్పత్రికు తరలించారు.
ఉదయం ఎనిమిది గంటల సమయంలో భరౌలీ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపు తప్పి టీ స్టాల్‌లోకి చొచ్చుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. వారిలొ ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనపై ఆగ్రహించిన గ్రామస్తులు నలుగురి మృతదేహాలను అక్కడికక్కడే ఉంచి రహదారిని దిగ్బంధించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్రౌలీ గ్రామం వెలుపల చట్టిలో ఉన్న టీ స్టాల్ వద్ద ప్రజలు కూర్చున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో, భరౌలీ వైపు నుండి వేగంగా అదుపుతప్పిన ట్రక్కు దుకాణంలోకి ప్రవేశించింది. ఉమాశంకర్ యాదవ్ (50), గోలు యాదవ్ (15), వీరేంద్ర రామ్ (45), సత్యేంద్ ఠాకూర్ (28) లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చంద్రమోహన్ రాయ్, శ్యామ్ బిహారీ సహా ముగ్గురిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అహ్రౌలీ నివాసి చంద్రమోహన్ రాయ్ (45), శ్యామ్ బిహారీ కుష్వాహా (35) చికిత్స పొందుతూ మరణించారు. ఆగ్రహించిన గ్రామస్తులు నలుగురి మృతదేహాలను రోడ్డుపైనే ఉంచి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రోడ్డును దిగ్బంధించారు. సమాచారం అందిన వెంటనే డీఎం ఎంపీ సింగ్, ఎస్పీ రాంబదన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
.