2013 Patna Bombings Case: మోదీని టార్గెట్ చేస్తూ వ‌రుస బాంబు పేలుళ్లు, పాట్నా గాంధీ మైదాన్ సీరియల్ బ్లాస్ట్ కేసులో న‌లుగురికి మ‌ర‌ణ‌శిక్ష‌ విధించిన ఎన్ఐఏ కోర్టు, ఇద్ద‌రికి జీవిత‌కాల శిక్ష‌, మ‌రో ఇద్ద‌రికి 10 ఏళ్ల జైలుశిక్ష
Court Judgment, representational image | File Photo

Patna, Nov 1: 2013లో పాట్నాలోని గంగానది ఒడ్డున ఉన్న గాంధీ మైదాన్ లో జ‌రిగిన వ‌రుస పేలుళ్ల ఘ‌ట‌న‌లో నిందితులైన న‌లుగురికి ఎన్ఐఏ కోర్టు మ‌ర‌ణ‌శిక్ష‌ను విధించింది. 9 మంది దోషుల్లో ఇద్ద‌రికి జీవిత‌కాల శిక్ష‌ను అమ‌లు చేయ‌నున్నారు. మ‌రో ఇద్ద‌రికి 10 ఏళ్ల జైలుశిక్ష ప‌డింది. ఒక‌రికి ఏడేళ్ల శిక్ష‌ను విధించారు.

2013 సీరియ‌ల్ బ్లాస్ట్ కేసులో మొత్తం 10 మందిని ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. ప్ర‌స్తుత ప్ర‌ధాని మోదీ అప్ప‌ట్లో గుజ‌రాత్ సీఎం హోదాలో ఓ ఎన్నిక‌ల స‌భ‌ను నిర్వ‌హించారు. అయితే ఆ స‌భ‌ను టార్గెట్ చేస్తూ వేదిక వ‌ద్ద పేలుళ్లు జ‌రిగాయి. ఆ పేలుళ్ల వ‌ల్ల ఆరుగురు మృతిచెందారు. ఈ కేసులో ఎన్ఐఏ జ‌డ్జి గుర్వింద‌ర్ మెహ‌రోత్రా తీర్పును వెలువ‌రించారు. విచార‌ణ స‌మ‌యంలో కోర్టు 11 మందిపై ఛార్జిషీటు దాఖ‌లు చేసింది. ఇంతియాజ్ అన్సారీ, ముజీబుల్లా, హైద‌ర్ అలీ, ఫిరోజ్ అస్ల‌మ్‌, ఒమ‌ర్ అన్సారీ, ఇఫ్తిక‌ర్‌, అహ్మ‌ద్ హుస్సేన్‌, ఉమ‌ర్ సిద్ధిఖి, అజారుద్దీన్‌లకు శిక్ష‌ల‌ను ఖ‌రారు చేశారు. ఫ‌క్రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించారు.

కట్టెల పొయ్యిలే బెటరా, వీధి వ్యాపారులకు మళ్లీ గ్యాస్ పోటు, తాజాగా 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 266 కు పెంపు

ఇప్పటి ప్రధాని మోదీ 2014లో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014 ఎన్నికలకు ముందు బీహార్ రాజధాని పాట్నాలో ర్యాలీ సభ నిర్వహించారు.ఈ సభను టార్గెట్ చేస్తూ దుండుగులు బాంబు దాడులతో విరుచుకు పడ్డారు. 27 అక్టోబర్ 2013 ఉదయం, పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్‌లో సుమారు 10:00 గంటలకు మొదటి బాంబు పేలింది.

అయితే పేలని రెండు బాంబులను బాంబు నిర్వీర్య సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రెండవ బాంబు 12:10కి పేలింది, మూడవ బాంబు 12:25కి పేలింది. రెండూ గాంధీ మైదాన్ సమీపంలోనే పేలాయి. గాంధీ మైదాన్ ప్రాంతంలో, వెలుపల మూడు బాంబులు పేలాయి, ఒకటి సినిమా హాల్ దగ్గర, మరొకటి పాట్నాలోని ట్విన్ టవర్ భవన సముదాయానికి సమీపంలో పేలింది.

ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 89 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మరుసటి రోజే ఎన్‌ఐఎ దర్యాప్తు చేపట్టింది. తర్వాత ఏడాదికి చార్జీషీట్‌ దాఖలు చేసి.. 11 మందిని జాబితాలో చేర్చింది.  ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ 2014లో ఇండియన్‌ ముజాహిదీన్‌‌కు చెందిన తొమ్మిది మంది, స్టూడెంట్స్ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ఈ పేలుడుకు కీలక సూత్రధారులు హైదర్‌ అలీ అలియాస్‌ ‘బ్లాక్‌ బ్యూటీ’, తౌఫిక్‌ అన్సారీ, మోజిబుల్లా, నుమాన్‌ అన్సారీలను అరెస్ట్‌ చేసింది. వీరు దోషులుగా నిర్ధారణ కావడంతో తాజాగా ఉరిశిక్ష ఖరారుచేసింది.