UP Shocker: యూపీలో దారుణం, బాలికను కిడ్నాప్ చేసి ట్యూషన్ టీచర్ దారుణంగా అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి
బైరియా ప్రాంతంలో 17 ఏళ్ల బాలికను ఆమె ట్యూషన్ టీచర్ అపహరించి అత్యాచారం (17-Year-Old Girl Abducted) చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు నితీష్ కుమార్‌ను ఆదివారం అరెస్టు చేసినట్లు సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ (బైరియా) అతుల్ మిశ్రా తెలిపారు.
బల్లియా, డిసెంబర్ 5: యూపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బైరియా ప్రాంతంలో 17 ఏళ్ల బాలికను ఆమె ట్యూషన్ టీచర్ అపహరించి అత్యాచారం (17-Year-Old Girl Abducted) చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడు నితీష్ కుమార్‌ను ఆదివారం అరెస్టు చేసినట్లు సీనియర్ సబ్ ఇన్‌స్పెక్టర్ (బైరియా) అతుల్ మిశ్రా తెలిపారు. నవంబర్ 7న యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం (Raped by Tuition Teacher in Ballia) చేశాడని కుమార్ చెప్పాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భారత శిక్షాస్మృతి, పోక్సో చట్టంలోని అత్యాచారం, కిడ్నాప్‌కు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనే అంశంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం.. పైశాచికత్వం ప్రదర్శించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. కాగా, బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి ముగ్గురు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం, ఆమెను కత్తిలో బెదిరించారు. ఈ క్రమంలోనే ఆమెపై ముగ్గురు యువకులు.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అకృత్యానికి పాల్పడుతూనే మహిళ పట్ల పైశాచికత్వం ప్రదర్శించారు.
లైంగిక దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రైవేటు భాగాలపై సిగరెట్‌తో కాల్చుతూ రక్షసానందం పొందారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో చేశారు. అనంతం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురి చేశారు. కాగా, బాధితురాలు తనకు జరిగిన అన్యాయం మరొకరి జరగొద్దనే కారణంతో ఎన్జోవోలను ఆశ్రయించింది.
దీంతో, నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు.