UP Shocker: యూపీలో దారుణం, భార్య రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని చంపేసిన భర్త, శవాన్ని ఎవరికి తెలియకుండా అడవిలో పడేసిన నిందితుడు, పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి..

భార్య రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని భర్త దారుణంగా ఆమెను (Moradabad Husband Killed Wife) చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో భర్త దారుణం వెలుగులోకి వచ్చింది.

Representational Image | (Photo Credits: IANS)

Lucknow, Dec 9: యూపీలో దారుణం చోటు చేసుకుంది. భార్య రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని భర్త దారుణంగా ఆమెను (Moradabad Husband Killed Wife) చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది. పోలీసుల విచారణలో భర్త దారుణం వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హ్మ‌ద్ అన్వ‌ర్(34)కు ఓ 30 ఏండ్ల మ‌హిళ‌తో తొమ్మిదేండ్ల‌ క్రితం వివాహ‌మైంది. వీరికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. అమ్రోహాలో అన్వ‌ర్ బేక‌రీ నిర్వ‌హిస్తున్నాడు. అయితే ఈ దంప‌తుల దాంప‌త్య జీవితం సాఫీగానే సాగిపోతోంది. ఇటీవ‌లే ఒక రోజు రాత్రి భార్యాభ‌ర్త‌ల‌కు గొడ‌వ జ‌రిగింది.

రెండోసారి శృంగారం వ‌ద్దు (Refusing Sex 2nd Time) అని భార్య చెప్పినందుకు భ‌ర్త‌కు కోపం వ‌చ్చింది. భార్య గొడవ చేయడంతో ఆగ్రహానికి లోనైన అన్వర్ భార్యను తాడుతో గొంతుకోసి హత్య చేసి, భార్య మృతదేహానికి ప్లాస్టిక్‌తో నింపి బైక్‌పై రాతుపురా గ్రామంలోని అడవి అంచున పడేశాడు. మొరాదాబాద్ జిల్లా.. అమ్రోహ నగర్ కొత్వాలిలో భార్య మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అన్వ‌ర్‌ను పోలీసులు మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో సీన్ రివర్స్, పెళ్లి చేసుకోమన్న ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన యువతి, నరాలు తెగడంతో 50 కుట్లు, నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. భర్త చేసిన ఈ పని విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రోడ్డు పక్కన మృతదేహాన్ని చూసి గ్రామస్తులు మొరాదాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించేందుకు పలు జిల్లాలకు మృతదేహం ఫొటోలను పంపించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇటీవల తప్పిపోయిన మహిళల వివరాలను కూడా పోలీసులు సేకరించారు.

తమిళనాడులో దారుణం, ప్రభుత్వ స్కూల్ టాయ్‌లెట్లో పసికందు మృతదేహం, కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టిన పోలీసులు

అదే క్రమంలో అమ్రోహ కొత్వాలిలో రుక్సర్ అదృశ్యమైన విషయం తెరపైకి వచ్చింది.చిత్రాలను సరిచూసినప్పుడు గోనె సంచిలో ఉన్న మృతదేహం అమ్రోహా నగర్ కొత్వాలిలోని మొహల్లా సరాయ్ కోహ్నా నివాసి రుక్సార్‌గా గుర్తించారు. ఆ తర్వాత నిందితుడైన భర్తను అమ్రోహా పోలీసులు విచారించగా.. తాను చేసిన నేరాన్ని అంగీకరించి.. ఈ ఘటనలో తన సోదరుడు డానిష్‌ సాయం తీసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.