Upendra Dwivedi Takes Over As 30th Army Chief: భారత ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన ఉపేంద్ర ద్వివేది, ఇంతకీ ఎవరీ మనోజ్ పాండే...పూర్తి వివరాలివే!
ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా (Army Chief Ace Infantry Officer) ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే పదవీ విరమణ చేయనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ జూన్ 12న ఉత్తర్వులు ఇచ్చింది.
New Delhi, June 30: భారత 30వ ఆర్మీచీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ గా (Army Chief Ace Infantry Officer) ఉన్న జనరల్ మనోజ్ సి.పాండే పదవీ విరమణ చేయనుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేదిని నియమిస్తూ జూన్ 12న ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ్టితో మనోజ్ పాండే పదవీకాలం ముగిసింది. రక్షణ శాఖ కార్యాలయంలో చివరిరోజున మనోజ్ పాండే గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. కాగా.. ఆయన స్థానంలో ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ గా (Army Chief Ace Infantry Officer) బాధ్యతలు చేపట్టారు. అతను గతంలో భారత సైన్యానికి వైస్ చీఫ్ అదేవిధంగా ఉత్తర సైన్యానికి కూడా నాయకత్వం వహించాడు.
1964 జూలై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. 1984 డిసెంబర్ 15న జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ లో చేరారు. ఇప్పటి వరకు 40 సంవత్సరాలపాటు పూర్తిచేసుకున్న ఆయన ఆర్మీలో పలు కీలక పాత్రలు పోషించారు. వివిధ కమాండ్, స్టాఫ్, ఇన్‌స్ట్రక్షనల్, విదేశీ నియామకాలలో పనిచేశారు. కాశ్మీర్ వ్యాలీ, రాజస్థాన్ సెక్టార్ లో పనిచేశారు. సెక్టార్ కమాండర్, అస్సాం రైపిల్స్ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉపేంద్ర ద్వివేది గతంలో డైరెక్టర్ జనరల్ ఇన్ ఫాంట్రీ, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా వ్యవహరించారు. సైనిక్ స్కూల్ రేవా, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, యూఎస్ ఆర్మీ వార్ కాలేజ్, DSSC వెల్లింగ్టన్, ఆర్మీ వార్ కాలేజ్ లో కోర్సులను అభ్యసించారు.
డిఫెన్స్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లో ఎంఫిల్, స్ట్రాటజిక్ స్టడీస్ మిలిటరీ సైన్స్‌లో ఉపేంద్ర ద్వివేది రెండు మాస్టర్స్ డిగ్రీలు చేశారు. కేంద్ర బలగాల్లో తన సేవలకు గాను పరమ విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను ఉపేంద్ర ద్వివేది అందుకున్నారు. ప్రస్తుతం పదవీ విరమణ చేసిన మనోజ్ పాండే 2022 ఏప్రిల్ 30న ఆర్మీ అథిపతిగా విధుల్లో చేరారు.. 26నెలల పాటు ఆయన ఆర్మీ చీఫ్ గా సేవలందించారు. మనోజ్ పాండే మే నెల చివరినాటికి పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని ఒక నెలపాటు పొడిగించింది.