Uttar Pradesh: మత్తుకు బానిసై జైలులో ఆ పనికి పాల్పడిన ఖైదీలు, 140 మందికి హెచ్‌ఐవీగా నిర్ధారణ, మరో 35 మందికి టీబీ, ఉత్తరప్రదేశ్ దాస్నా జైలులో సంచలన విషయం వెలుగులోకి..

మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని జైలు సీనియర్‌ అధికారులు ధ్రువీకరించారు.

Representational Image (Photo Credits: Pixabay)

Dasna, Nov 19: ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఘజియాబాద్‌లోని దాస్నా జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ నిర్ధారణ ( Diagnosed with HIV) కావడం సంచలనం రేపుతోంది. మరో 35 మందికి టీబీ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని జైలు సీనియర్‌ అధికారులు ధ్రువీకరించారు. వారికి (140 Inmates of Dasna Jail) ప్రత్యేక కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. దాస్నా జైలులో ప్రస్తుతం 5500 మంది ఖైదీలున్నారు. ఇటీవల వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటకు వచ్చింది.ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, జైలుకి తరలించే ముందు ఖైదీలందరికీ హెచ్‌ఐవీ పరీక్ష చేస్తామని చెప్పారు.

2016లో అక్కడి జైళ్లలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ క్యాంపులను రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ చేపట్టింది. అప్పట్లో కేవలం 49 మందికి మాత్రమే ఎయిడ్స్‌ ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా హెచ్‌ఐవీ, టీబీ పరీక్షలను తప్పనిసరిగా చేపడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఖైదీకి హెచ్‌ఐవీ నిర్ధారణ అయితే, వారికి అక్కడే ఉండే ఇంటిగ్రేటెడ్‌ కౌన్సిలింగ్‌ అండ్‌ ట్రీట్మెంట్‌ సెంటర్లో (ఐసీటీసీ) ఏఆర్‌వీ చికిత్స అందిస్తున్నారు.ఇక 2016 నుంచి సరాసరి 120 నుంచి 150 మంది హెచ్‌ఐవీ సోకిన ఖైదీలు ఆ జైల్లో ఉంటున్నారు.

వీడికి ఇదేం పోయేకాలం, శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు, బిత్తరపోయిన అతిధులు, సోషల్ మీడియాలో క్లిప్ వైరల్

ఈ హెచ్‌ఐవీ పాజిటివ్ ఖైదీలందరి విషయంలో జైలు యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. వారి చికిత్స కోసం ఎయిడ్స్ నియంత్రణ కమిటీని సంప్రదించారు. అక్కడి నుంచి వైద్యులను, ఆరోగ్య బృందాన్ని పిలిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా యంత్రాంగం కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. జైలులో ఉన్న ఖైదీలందరినీ విచారించబోతున్నారు.

దాస్నా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఎయిడ్స్‌తో బాధపడుతున్న ఖైదీలందరిపై మరింత అప్రమత్తంగా ఉంటామని తెలిపారు. ఇది సాధారణ పరీక్ష అయినప్పటికీ, భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం రోగులను గుర్తించడంతో వారందరికీ చికిత్స అందిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని తెలిపారు. ఈ వ్యాధి సోకిన సూదితో ఇంజెక్షన్ ఎక్కిస్తే రక్తం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వీరిలో చాలా మందికి ఒకే సిరంజి లేదా సూదితో మత్తుగా ఉండటం వల్ల ఈ వ్యాధి వచ్చిందని ఆయన తెలిపారు. ఘజియాబాద్ జైలులోని ఖైదీలను ఎంఎంజీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యాంటీ రెట్రోవైరల్ థెరపీ సెంటర్ వైద్యులు తనిఖీ చేస్తారని, జిల్లా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు. కొందరు టీబీతో సహా ఇతర వ్యాధుల లక్షణాలను కలిగి ఉన్నట్లు తేలింది.