Uttar Pradesh: యూపీలో విచిత్ర ఘటన, పెళ్లి కొడుకు ముక్కు చిన్నగా ఉందని పెళ్లిలో గుసగుసలు, వధువు చెవిన పడటంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికూతురు

వరుడు వచ్చిన వెంటనే, వరుడి ముక్కు గురించి పెళ్లికి వచ్చిన వారి నుంచి గుసగుసలు వచ్చాయి, అది వధువు చెవిన పడటంతో వెంటనే నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పేసింది వధువుజ అతని ముక్కు చదునుగా చిన్నదిగా ఉందని చెప్పి పెళ్లిని తిరస్కరించి (Bride calls off wedding) అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Representational Image (Photo Credits: unsplash.com)

Lucknow, Dec 9: వరుడు వచ్చిన వెంటనే, వరుడి ముక్కు గురించి పెళ్లికి వచ్చిన వారి నుంచి గుసగుసలు వచ్చాయి, అది వధువు చెవిన పడటంతో వెంటనే నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పేసింది వధువుజ అతని ముక్కు చదునుగా చిన్నదిగా ఉందని చెప్పి పెళ్లిని తిరస్కరించి (Bride calls off wedding) అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో డిసెంబర్ 7న సంభాల్‌లోని అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతీయువకులకు వివాహం నిశ్చయమైంది. బుధవారం పెళ్లి జరగాల్సి ఉండగా వధువు ఇంటికి వరుడి కుటుంబం ఊరేగింపుగా చేరుకుంది. పెళ్లి కొచ్చిన వారితో వధువు ఇల్లు సందడిగా మారింది.

యూపీలో దారుణం, భార్య రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని చంపేసిన భర్త, శవాన్ని ఎవరికి తెలియకుండా అడవిలో పడేసిన నిందితుడు, పోలీసుల విచారణలో నిజం వెలుగులోకి..

ఈ క్రమంలో పెళ్లికొచ్చిన వారిలో కొందరు మహిళలు వరుడ్ని చూసి అతడి ముక్కు చాలా చిన్నగా ( groom's 'flat and small nose) ఉందని గుసగుసలాడుకున్నారు. ఇది అటూఇటూ తిరిగి అది వధువు చెవిన పడింది. వారి మాటలు నిజమో, కాదో తెలుసుకునేందుకు స్వయంగా వెళ్లి చూసింది. కాబోయే వాడి ముక్కు నిజంగానే కాస్తంత చిన్నగా ఉండడంతో కఠిన నిర్ణయం తీసుకుంది. తాను అతడిని పెళ్లి చేసుకోబోనంటూ మంకుపట్టు పట్టింది.

హైదరాబాద్‌లో సీన్ రివర్స్, పెళ్లి చేసుకోమన్న ప్రియుడిపై బ్లేడుతో దాడి చేసిన యువతి, నరాలు తెగడంతో 50 కుట్లు, నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

దీంతో కంగుతిన్న ఇరు కుటుంబాల వారు వధువుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది.వధువు మొండి పట్టుదల మధ్య, ఆమెను ఒప్పించేందుకు గ్రామ పంచాయతీ చాలా సేపు సాగింది, అయితే పంచాయతీ కూడా ఆ పనిలో విఫలమైంది.అయితే అలాంటి కేసు తన దృష్టికి రాలేదని అస్మోలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ తెలిపారు.