IPL Auction 2025 Live

Uttar Pradesh: ఇదేమి నిర్లక్ష్యపు వైద్యం, మహిళ కడుపులో టవల్ పెట్టి ఆపరేషన్ చేసిన వైద్యుడు, 5 రోజులు కడుపునొప్పితో అల్లాడిపోయిన బాధితురాలు, మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఘటన వెలుగులోకి..

కాన్పు కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి (Doctor leaves towel inside) నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేశాడు అక్కడి వైద్యుడు. అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Amroha Chief Medical Officer Rajeev Singhal (Photo-ANI)

Lucknow, Jan 4: యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన మహిళ కడుపులో టవల్ ఉంచేసి (Doctor leaves towel inside) నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేశాడు అక్కడి వైద్యుడు. అమ్రోహాలోని బాన్స్ ఖేరీ గ్రామంలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన వివరాల్లోకెళ్తే.. నజరానా అనే మహిళ నెలలు నిండటంతో ప్రసవ వేదనతో సైఫీ నర్సింగ్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యింది. ఐతే అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆమె కడుపులో (woman's stomach) టవల్‌ ఉంచేసి ఆపరేషన్‌ చేశారు డాక్టర్‌ మత్లూబ్‌.

విమానంలో దారుణం, ఫ్యాంట్ జిప్పి విప్పి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఓ వ్యక్తి, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖ రాసిన బాధితురాలు

ఆపరేషన్ తర్వాత ఆ మహిళకు కడుపు నొప్పి ఎక్కువ అవ్వడంతో తాళలేక సదరు డాక్టర్‌కి ఫిర్యాదు చేసింది. ఐతే బయట చలి ఎక్కువగా ఉండటం వల్లే అలా అనిపిస్తుందని చెప్పి మరో ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచేశారు. కానీ ఆమెకు ఇంటికి వచ్చినా..ఆరోగ్యం మెరుగవ్వకపోవడంతో.. భర్త షంషేర్‌ అలీ ఆమెను అమ్రెహాలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు బాధితురాలి కడుపులో టవల్‌ ఉందని, ఆపరేషన్‌ చేసి తీసేసినట్లు అక్కడి ఆస్పత్రి వైద్యులు అలీకి తెలిపారు. దీంతో భర్త ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

ఎయిరిండియా విమానంలో పాము కలకలం, దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో గుర్తించిన సిబ్బంది, విచారణకు ఆదేశించిన డీజీసీఏ

దీంతో అలీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓ)కు సదరు ఆస్పత్రి నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. మీడియా కథనాల ద్వారా విషయం తెలుసుకున్న చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంఓ) రాజీవ్‌ సింఘాల్‌ ఈ విషయంపై సమగ్ర విచారణ చేయమని నోడల్‌ అధికారి డాక్టర్‌ శరద్‌ను ఆదేశించారు. విచారణ నివేదిక రాగనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తారని (CMO orders probe) సీఎంవో అధికారి సింఘాల్‌ చెప్పారు.



సంబంధిత వార్తలు

AP CM Chandrababu: గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయి..జీవోలను రహస్యంగా ఉంచారని సీఎం చంద్రబాబు మండిపాటు, అధికారాన్ని దుర్వినియోగం చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని కామెంట్

Deputy CM Pawan Kalyan: కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

Sambhal Shahi Jama Masjid Survey: యూపీలో మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై రాళ్లు రువ్విన స్థానికులు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, వీడియోలు ఇవిగో..