Uttar Pradesh Shocker: మరో విద్యార్థిపై టీచర్ వికృత క్రీడ, రూ. 250 ఫీజు చెల్లించలేదని బాలుడిని దారుణంగా కొట్టి చంపిన టీచర్, యూపీలో షాకింగ్ ఘటన వెలుగులోకి..

కేవలం రూ.250 స్కూల్‌ ఫీజు కోసం 3వ తరగతి విద్యార్థిని (Class 3 Student) ఒక టీచర్‌ కొట్టి చంపాడు.

Representational Image

Lucknow, August 20: రాజస్థాన్ రాష్ట్రంలో దళిత బాలుడి దారుణ మరణం మరచిపోకముదై యూపీలో మరో ఘటన చోటు చేసుకుంది. కేవలం రూ.250 స్కూల్‌ ఫీజు కోసం 3వ తరగతి విద్యార్థిని (Class 3 Student) ఒక టీచర్‌ కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లాలో గల సిర్సియాలోని పండిట్ బ్రహ్మదత్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 13 ఏళ్ల బ్రిజేష్ కుమార్ మూడవ తరగతి చదువుతున్నాడు. కాగా, ఆ బాలుడు రెండు నెలల కిందటే ఆ స్కూల్‌లో చేరాడు.

మొదటి నెల స్కూల్‌ ఫీజు కింద రూ.250 చెల్లించాడు. రెండో నెల స్కూల్‌ ఫీజు చెల్లించడంలో కాస్త ఆలస్యమైంది. వారి కుటుంబానికి ఆధారమైన పెద్ద అన్నయ్య వేరే ప్రాంతంలో పని చేస్తున్నాడు. ఆయన డబ్బులు పంపించలేకపోవడంతో ఆ విద్యార్థి స్కూల్‌ ఫీజు చెల్లించలేదు.కాగా, ఈ నెల 8న స్కూల్‌ టీచర్‌ అనుపమ్ పాఠక్‌, ఫీజు చెల్లించని విద్యార్థి బ్రిజేష్‌ కుమార్‌ను దారుణంగా (Beaten by Teacher for School Fee,) కొట్టాడు. దీంతో ఆ బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల తర్వాత విద్యార్థి బ్రిజేష్‌ కుమార్‌ ( Dies in Hospital) చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టీచర్‌ అనుపమ్‌ పాఠక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ బాలుడి మరణంలో కుల ప్రస్తావనే లేదు, చిన్నారి మృతి కేసులో సంచలన ట్విస్ట్ ఇచ్చిన రాజస్థాన్‌ చైల్డ్‌ ప్యానెల్‌, ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవే కారణమని వెల్లడి

తన తమ్ముడు రెండు నెలల కిందటే ఆ స్కూల్‌లో చేరాడని, మొదటి నెల ఫీజుగా రూ.250 కూడా చెల్లించినట్లు మృతుడి అన్న తెలిపాడు. డబ్బులు అందకపోవడంతో రెండో నెల స్కూల్‌ ఫీజు చెల్లింపులో కాస్త ఆలస్యమైందని, దీనికే తన తమ్ముడ్ని టీచర్‌ కొట్టి చంపాడని ఆయన ఆరోపించాడు.



సంబంధిత వార్తలు

Cold Wave Grips Telangana: హైదరాబాద్ వాసులకు అలర్ట్, మరో రెండు రోజులు వణికించనున్న చలిగాలులు, తెలంగాణలో కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Rain Alert for AP: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణను వణికిస్తున్న చలి, హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు