Uttarakhand Road Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, గురుద్వారాకు వెళుతున్న భక్తుల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ, ఆరుగురు మృతి, చాలామందికి గాయాలు
రాష్ట్రంలోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు (Six People Lost Their Lives) మృత్యువాతపడ్డారు.
Lucknow, August 29: ఉత్తరాఖండ్‌లో ఆదివారం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో భక్తులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు (Six People Lost Their Lives) మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో 37 మంది గాయపడ్డట్లు సమాచారం. ప్రమాదం వివరాలు తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో క్షతగాత్రులు, మృతుల బంధువుల రోదనలతో తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు, అధికార యంత్రాంగం ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
శక్తి ఫారం ప్రాంతంలోని బాస్గర్ గ్రామానికి చెందిన దాదాపు 45 నుంచి 50 మంది భక్తులు సరిహద్దులో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తమ్‌నగర్‌లో ఉన్న గురుద్వారాకు పూజలు చేయడానికి ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఉత్తమ్‌నగర్ గురుద్వారాలో ప్రతి ఆదివారం, గురుగ్రంథ సాహిబ్ పారాయణం, లంగర్ కార్యక్రమం జరుగుతుండగా.. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.
సిర్సా అవుట్‌పోస్ట్ బరేలీ జిల్లాలోని బహేరి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అవుట్ పోస్ట్ సమీపంలో ట్రాక్టర్ రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో (Uttarakhand Road Accident) గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మొత్తం ఆరుగురు మరణించారని మంత్రి పేర్కొన్నారు.
Here's ANI Tweets
సితార్‌గంజ్‌లోని సిర్సా మోర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల సీఎం పుష్కర్ సింగ్ ధామి సంతాపం తెలిపారు. మృతుల బంధువులకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ హల్ద్వానీలోని ఆసుపత్రిని సందర్శించారు.
జౌన్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం పట్ల ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం (CM Yogi Adityanath Condoles) తెలిపారు. క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.