Uttarkashi Tunnel Rescue Operation Update: సొరంగంలో చిక్కుకున్న ఆ 41 మందిపై చిగురించిన ఆశలు, దరిదాపులకు చేరుకున్న డ్రిల్లింగ్ మిషన్ పనులు
ప్రస్తుతం క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ వారికి సమీపంలో 42 మీటర్లు లేదా 67 శాతానికి చేరుకుంది, లోపల చిక్కుకున్న 41 మంది త్వరలో బయటకు వస్తారని ఆశలు మళ్లీ చిగురించాయి.
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వంతో పాటు అధికారుల శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ వారికి సమీపంలో 42 మీటర్లు లేదా 67 శాతానికి చేరుకుంది, లోపల చిక్కుకున్న 41 మంది త్వరలో బయటకు వస్తారని ఆశలు మళ్లీ చిగురించాయి. . సొరంగంలోని కార్మికులను వెలికి తీసేందుకు సహాయ బృందాలు కేవలం 12 మీటర్ల దూరంలోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఆహార పంపిణీకి సంబంధించిన రెండవ లైఫ్‌లైన్ సమర్థవంతంగా పనిచేస్తోందని, రోటీ, సబ్జీ, కిచ్డీ, దలియా, నారింజ, అరటిపండ్లు వంటి మందులు, ఇతర నిత్యావసర వస్తువుల సరఫరాతో పాటు, టీ-షర్టు, లోదుస్తులు, టూత్‌పేస్ట్, సబ్బు మొదలైన వాటి సరఫరాను నిర్ధారిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
జమ్ము కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు ఇద్దరు సైనికులు మృతి
ఆర్‌ఎఫ్/ఎస్‌డిఆర్‌ఎఫ్ ద్వారా వైర్ కనెక్టివిటీతో కూడిన సవరించిన కమ్యూనికేషన్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారని, దీని ద్వారా స్పష్టమైన కమ్యూనికేషన్ జరుగుతోందని మరియు "లోపల ఉన్న వ్యక్తులు తాము సురక్షితంగా ఉన్నారని ఉదయం నివేదించారని పేర్కొంది."NHIDCL సిల్క్యారా చివర నుండి క్షితిజసమాంతర బోరింగ్‌ను తిరిగి ప్రారంభించింది. ఆగుర్ బోరింగ్ మెషీన్‌ని ఉపయోగించి కార్మికులను రక్షించడానికి ఇప్పటి వరకు 42 మీటర్ల పైపులు లోపలకు వేసారని ప్రకటన పేర్కొంది. కాగా నిలిచిపోయిన క్షితిజ సమాంతర డ్రిల్లింగ్ ఆపరేషన్ మంగళవారం తిరిగి ప్రారంభమైంది.
Here's Video
సహాయక చర్యలు కీలక దశకు చేరుకోవడంతో తమ రాష్ట్రానికి చెందిన 15 మంది కార్మికులను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటిస్తే.. వారిని విమానంలో తరలించడానికి సిద్ధంగా ఉన్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. డెహ్రాడూన్ నుంచి రాంచీకి విమానంలో తరలించనున్నట్లు వెల్లడించింది.
మరోవైపు రెస్క్యూ సిబ్బంది కార్మికుల కోసం పడకలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే టన్నెల్ బయట 20 అంబులెన్స్‌లను రెడీగా ఉంచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి కాసేపట్లో ఘటనాస్థలికి చేరుకునే అవకాశం ఉంది.