West Bengal Train Accident Update: ఘోర రైలు ప్రమాదానికి కారణమిదే, రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 5 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, వీడియోలు ఇవిగో..

పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిలిగురి వద్ద అగర్తాల నుంచి సిల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను (Kanchanjunga Express) గూడ్స్‌ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు

West Bengal Train Accident Update

kolkata, June 17: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సిలిగురి వద్ద అగర్తాల నుంచి సిల్దా వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను (Kanchanjunga Express) గూడ్స్‌ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, మరో 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాద స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

అసోంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సీల్దాకు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ సిలిగురి దాటిన తర్వాత రంగ్‌పనీర్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో రైలు వెనుక భాగంలో ఉన్న మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో రెండు ప్రయాణీకుల బోగీలు, ఒక పార్శిల్ బోగీ దెబ్బతిన్నట్లు రైల్వేశాఖ నుంచి సమాచారం అందింది. రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో ఆ ప్రాంతంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. గూడ్స్ రైలును ఢీకొన్న కాంచన్ జంగ ఎక్స్‌ ప్రెస్‌.. గాల్లోకి లేచిన బోగీ.. పలువురి మృతి!

గూడ్స్ రైలు సిగ్నల్‌ను అధిగమించి కాంచన్‌జంగా రైలును వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రాథమిక దర్యాప్తులో అధికారులు పేర్కొన్నారు.ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరింత సమాచారం సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను విశ్లేషిస్తున్నారు. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో అగర్తల-కోల్‌కతా రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది.

ప్రమాదం ధాటికి రెండు రైళ్ల బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు రెండు పట్టాలపై నుంచి పక్కకు పడిపోయాయి. పలు కోచ్‌లు నుజ్జునుజ్జు అయ్యాయి. గూడ్స్‌ రైలు ఇంజిన్‌ ఓ బోగీ కిందికి దూసుకెళ్లింది. ఇక గూడ్స్‌ రైలు డబ్బాలు అంత దూరంలో పడిపోయాయి.

Here's Videos

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించి X వేదికగా ఓ పోస్ట్ చేశారు. డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా ప్రాంతంలో జరిగిన విషాద రైలు ప్రమాదం గురించి తెలుసుకుని షాక్ అయ్యానని తెలిపారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో DM, SP, వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు రెస్క్యూ, రికవరీ, వైద్య సహాయం కోసం స్థలానికి చేరుకున్నాయని, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేశారు.

033-23508794

033-23833326

GHY స్టేషన్

03612731621

03612731622

03612731623

LMG హెల్ప్‌లైన్ నంబర్లు

03674263958

03674263831

03674263120

03674263126

03674263858

KIR స్టేషన్ హెల్ప్ డెస్క్ నెం- 6287801805

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now