BJP Leader Died by Suicide: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ నేత, ఇంటికి సమీపంలో పార్కులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు జీఎస్ బవా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పశ్చిమ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడైన జీఎస్ బవా (West Delhi BJP’s former vice-president GS Bawa)తన ఇంటికి సమీపంలోని పార్కులో ఆత్మహత్య చేసుకున్నాడు.

West Delhi BJP’s former vice-president GS Bawa (Photo-Video grab)

New Delhi, Mar 30: ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీఎస్ బవా పార్కులో ఆత్మహత్య (BJP Leader Died by Suicide) చేసుకున్నారు. పశ్చిమ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడైన జీఎస్ బవా (West Delhi BJP’s former vice-president GS Bawa)తన ఇంటికి సమీపంలోని పార్కులో ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుటుంబ విషయాల వల్ల బీజేపీ నేత బవా ఆత్మహత్య (former vice-president GS Bawa hangs) చేసుకున్నాడని పోలీసులు, బీజేపీ నేతలు భావిస్తున్నారు. ః

58 ఏళ్ల జీఎస్ బవా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్ నివాసి.ఢిల్లీలోని సుభాష్ నగర్ పార్కులో చెరువు ఒడ్డున గ్రిల్ కు బవా సోమవారం సాయంత్రం ఉరి వేసుకున్నాడు. వాకింగ్ కోసం పార్కుకు వచ్చిన సందర్శకులు గ్రిల్ కు మృతదేహం వేలాడుతుండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బవా మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

దేశంలో కరోనా విశ్వరూపం, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకి కరోనా, తాజ్ ఐదు నక్షత్రాల హోటల్ లో 76 మందికి కరోనా, భువనేశ్వర్ ఐఐటీలో 10 మంది విద్యార్థులకు కోవిడ్

సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కుటుంబ స‌మ‌స్య‌ల కార‌ణంగానే జీఎస్ బ‌వా ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చ‌ని స్థానికులు భావిస్తున్నారు. అయితే పార్టీ కాని, పోలీసులు కాని ఇంకా అతని మరణం వెనుక గల కారణాన్ని ఇంకా పేర్కొనలేదు.