WhatsApp Accounts Banned: భారత్‌లో 20 లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేదం, ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నందుకు చర్యలు
కేవలం అక్టోబర్(October) నెలలోనే 20 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. అశ్లీల(Abuse) సమాచారం, ఫేక్ న్యూస్(Fake News) వ్యాప్తి, ఇతర యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్(WhatsApp) ఈ చర్య తీసుకుంది.
New Delhi December 02: భారత్‌లో భారీగా ఖాతాలను నిషేదించింది వాట్సాప్ (WhatsApp). కేవలం అక్టోబర్(October) నెలలోనే 20 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. అశ్లీల(Abuse) సమాచారం, ఫేక్ న్యూస్(Fake News) వ్యాప్తి, ఇతర యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు వాట్సాప్(WhatsApp) ఈ చర్య తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హానికర ఖాతాలను తొలగించామని వివరించింది.
వాట్సాప్(WhatsApp) ఖాతా రిజిస్ట్రేషన్, సదరు యూజర్ పంపే మెసేజ్‌లు, వాటిపై మరో ఖాతాదారు ఫిర్యాదులను తమ అనలటిక్స్ బృందం పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology) రూల్స్ 2021లోని 4 (1) (డీ) నిబంధనకు అనుగుణంగా 20.69 లక్షల ఖాతాలను నిషేధించామని వాట్సాప్ ప్రకటించింది.
అక్టోబర్‌లో 18 ఖాతాలపై 500 విజ్ఞప్తులు వచ్చాయని వాట్సాప్ (WhatsApp) వివరించింది. వీటిలో 146 నివేదికలు, 248 నిషేధ విజ్ఞప్తులు, 53 ప్రొడక్ట్ నివేదికలు, 11 సేఫ్టీ నివేదికలు, 42 ఇతర విజ్ఞప్తులు ఉన్నాయన్నది. వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపిన వారు, పొందిన వారు మినహా ఇతరులెవ్వరూ ఆ సందేశం చూడలేరని స్పష్టం చేసింది. తమ ఎండ్‌టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతెంతో పటిష్ఠమైందని తెలిపింది. ప్రతీ నెలా వాట్సాప్ భారీ ఎత్తున ఫేక్ అకౌంట్లను నిషేదిస్తూ వస్తోంది. సెప్టెంబర్‌లో కూడా 20లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది.