Tamil Nadu Shocker: కోడలిపై కక్ష పెంచుకున్న అత్త, అర్థరాత్రి నిద్రిస్తుండగా యాసిడ్ ముఖం, నోట్లో పోసి చంపేందుకు ప్రయత్నం

తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్ధాచలం వద్ద తన కోడలుపై యాసిడ్‌ పోసినందుకు ఓ మహిళను సోమవారం అరెస్టు (Woman arrested) చేసినట్లు పోలీసులు తెలిపారు.ఆదివారం రాత్రి నిద్రిస్తున్న కృతిక (26) ముఖంపై 55 ఏళ్ల ఆండాళ్ యాసిడ్ (throwing acid on daughter-in-law ) పోసింది

Representational Image | (Photo Credits: PTI)

Cuddalore, Mar 14: తమిళనాడులోని కడలూరు జిల్లా వృద్ధాచలం వద్ద తన కోడలుపై యాసిడ్‌ పోసినందుకు ఓ మహిళను సోమవారం అరెస్టు (Woman arrested) చేసినట్లు పోలీసులు తెలిపారు.ఆదివారం రాత్రి నిద్రిస్తున్న కృతిక (26) ముఖంపై 55 ఏళ్ల ఆండాళ్ యాసిడ్ (throwing acid on daughter-in-law ) పోసింది.

ఆండాళ్ కుమారుడు ముఖేష్ రాజ్‌కు కృతికతో గత ఏడేళ్ల క్రితం వివాహమైందని, వారికి 5 మరియు 1 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు.ముకేశ్ తిరుపూర్‌లోని అవినాశిలోని ఒక అపెరల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, కృతిక తన అత్తగారైన ఆండాళ్‌తో కలిసి ఉంటోంది.

ప్రేమోన్మాదికి సరైన శిక్ష, బాలికను 34 సార్లు కత్తితో పొడిచిన ఉన్మాదికి ఉరిశిక్ష విధించిన కోర్టు, గుజరాత్ రాష్ట్రంలో 2021లో జరిగిన ఘటనపై తీర్పు

కృతికపై అనుమానం పెంచుకున్న అత్త ఆండాలు కోడల్ని తరచూ వేధింపులకు గురి చేసేది. ఆదివారం రాత్రి ఆండాళ్‌కు కృత్తికకు గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృత్తిక ఇంటిలో నిద్రపోతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆండాలు టాయిలెట్‌కు ఉపయోగించే ఆసిడ్‌ను కృత్తిక ముఖంపై పోసి నోటిలో కూడా పోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. కృత్తిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు దీనిపై విరుదాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అక్కను చూసేందుకు వచ్చిన మరదలిపై బావ అత్యాచారం, వద్దు బావా తప్పు అని బతిమిలాడినా వదలకుండా...ఏం జరిగిందంటే..

పోలీసులు కృత్తికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆండాలును అరెస్టు చేశారు. కాగా కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన కలివరదన్‌ భార్య ఆండాళ్‌ విరుదాచలం (నిందితురాలు) అన్నాడీఎంకే ఉప కార్యదర్శిగా ఉన్నారు.