Credits: Google

మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. క్షణకాలం సుఖం కోసం మనుషులు మృగాలుగా మారిపోతున్నారు.  వావి వరుసలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా తండ్రిలా ఆలనా పాలనా చూడాల్సిన అక్క భర్త అయినటువంటి బావ, చుట్టుపు చూపుగా వచ్చిన మరదలిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను గర్భిణిని చేశాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని ఇటార్సీ ప్రాంతానికి చెందిన బాధిత యువతిపై ఆమె బావ సూరజ్ ( పేరు మార్చాం) అత్యాచారం చేశాడు. సెలవలు ఉన్నాయని అక్క, బావలను కలిసి వద్దామని ఇంటికి వచ్చిన మరదలిని గదిలోకి లాగి, నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

AP Shocker: నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై అత్యాచారయత్నం ...

3 నెలల క్రిందట జరిగిన ఈ ఘటనపై భయంతో యువతి ఎవరికీ నిజం చెప్పలేదు. అస్వస్థతగా ఉండడంతో యువతిని ఆమె తల్లి సోమవారం ఆసుపత్రికి తీసుకెళ్లింది. దీంతో ఆమె గర్భిణీ అని వెల్లడైంది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు పెట్టారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.