Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Gandhi Nagar, Mar 14: 11వ తరగతి బాలికను 34 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన 27 ఏళ్ల వ్యక్తికి జెట్‌పూర్‌లోని సెషన్స్ కోర్టు సోమవారం మరణశిక్ష (Gujarat Man Gets Death Sentence) విధించింది. హత్య చేసిన జయేష్ సర్వయ్యకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఆర్ ఆర్ చౌదరి తీర్పు చెప్పారు.మార్చి 2021లో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిందీ ఘటన. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన ప్రేమను నిరాకరించిన 11వ తరగతి చదువుతున్న బాలికపై 26 ఏళ్ల జయేష్ సార్వయా కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 34 సార్లు పొడిచి (Stabbing Teen 34 Times) ఆమె మరణానికి కారణమయ్యాడు.

బాలికను 34 సార్లు పొడిచిన యువకుడికి మరణశిక్ష.. ప్రేమను నిరాకరించినందుకు ఘాతుకం.. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘటన

ఈ కేసును విచారించిన అడిషనల్ డిస్ట్రిక్ట్స్, సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ కేసును న్యాయమూర్తి అరుదైన కేసుల్లో అరుదైనదిగా అభివర్ణించారు. నిందితుడికి మరణశిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా కూడా విధించించారు. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు. నేరానికి వారం రోజుల ముందు కత్తి కొనుగోలు చేసేందుకు రాజ్‌కోట్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటిలా పట్టణానికి వెళ్లినందున హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించింది.

మలావిని అతలాకుతలం చేసిన ఫ్రెడ్డీ తుపాను.. నెల రోజుల వ్యవధిలో రెండోసారి విరుచుకుపడిన తుపాను.. 100 మందికిపైగా మృత్యువాత.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

బాధిత బాలిక, నిందితుడు ఇద్దరూ జెట్‌పూర్‌లోని జెటల్సాపూర్ గ్రామానికి చెందినవారే. బాలికను అప్పటికే కొంత కాలంగా వేధిస్తున్న జయేశ్ 16 మార్చి 2021న తన ప్రేమ విషయాన్ని ప్రపోజ్ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అతడి ప్రపోజల్‌ను నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జయేశ్ ఆమె ఇంటి బయటే కత్తితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన బాలిక మరణించింది. తాజాగా, ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. జయేశ్‌కు మరణశిక్ష పడిన విషయం తెలిసిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.