Nikhat Zareen Wins Second Title: చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం నిఖత్ జరీన్, వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ కైవసం, భారత్‌కు మూడో గోల్డ్ సాధించిన నిఖత్
ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. వరుసగా రెండోసారి ఫైనల్లో విజయం సాధించి గోల్డ్ మెడల్ అందుకుంది. 48- 50 కిలోల విభాగంలో ఆమె చాంపియన్‌గా అవతరించింది. తన పంచ్ చూపించిన నిఖత్ రెండుసార్లు ఆసియా కప్ విజేత అయిన గుయెన్ థి టామ్(Nguyen Thi Tam )ను ఫైనల్లో ఓడించింది.
New Delhi, March 26: భారత స్టార్ బాక్సర్.. ఇందూరు బిడ్డ నిఖత్ జరీన్ (Nikhat Zareen) మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటింది. వరుసగా రెండోసారి ఫైనల్లో విజయం సాధించి గోల్డ్ మెడల్ (Nikhat Zareen Wins Gold) అందుకుంది. 48- 50 కిలోల విభాగంలో ఆమె చాంపియన్‌గా అవతరించింది. తన పంచ్ చూపించిన నిఖత్ రెండుసార్లు ఆసియా కప్ విజేత అయిన గుయెన్ థి టామ్ (Nguyen Thi Tam )ను ఫైనల్లో ఓడించింది. దాంతో, ఈ చాంపియన్‌షిప్‌లో ఆమెకు ఇది రెండో బంగారు పతకం. దాంతో, ఈ టోర్నమెంట్‌లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచిన రెండో భారతీయురాలుగా నిఖత్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఒలింపిక్ విజేత మేరీ కామ్ మాత్రమే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించింది.
ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆది నుంచి నిఖత్ జరీన్ జోరు కొనసాగించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. క్వార్టర్స్ బౌట్‌లో నిఖత్ 5-2 తేడాతో చుతామత్ రక్సాత్(థాయ్‌లాండ్)పై అద్భుత విజయం సాధించింది. ఫైనల్లో నిఖత్, గుయెన్ థి టామ్‌పై పంచ్‌ల వర్షం కురిపించింది. ఆమె ధాటికి వియత్నాం బాక్సర్ చేతులెత్తేసింది. దాంతో, వరుసగా రెండోసారి 48- 50 కిలోల విభాగంలో ఈ స్టార్ బాక్సర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది.
ఇప్పటికే స్వీటి, నీతూ గంఝాస్ స్వర్ణ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. మరోవైపు 75 కేజీల విభాగంలో లవ్లీనా కూడా గోల్డ్ సాధించాలని పట్టుదలతో ఉంది. ఆమె ఫైనల్లో ఆస్ట్రేలియా బాక్సర్ పార్కర్‌తో తలపడుతుంది.