Verification Compulsory For These Aadhar: కొత్తగా ఆధార్ తీసుకునే వారికి పాస్‌ పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థ.. త్వరలో ఫిజికల్ వెరిఫికేషన్ నిబంధన.. దీంతో ఆధార్ జారీకి 180 రోజులు పట్టే సమయం.. ఆధార్ అప్‌ డేషన్ మాత్రం ప్రస్తుత పద్ధతిలోనే

18 ఏండ్లు వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి తప్పనిసరిగా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ సంస్థ వర్గాలు వెల్లడించాయి.

Aadhaar-Card ( Photo Credit: Twitter/@aadhaar)

Newdelhi, Dec 21: భారత్ లో ప్రధాన గుర్తింపు కార్డుగా (Identity Card) చెప్పుకొనే ఆధార్ (Aadhar) లో సమూల మార్పులు రానున్నాయి. 18 ఏండ్లు వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి తప్పనిసరిగా ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ (UIDAI) సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాస్‌ పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవడంతో పాటు జిల్లా, సబ్ డివిజనల్ స్థాయిల్లో  నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను నియమిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం జిల్లా ప్రధాన పోస్టాఫీసులు, ఇతర ఆధార్ కేంద్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

TDP Yuvagalam Navasakam: ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రా 30 ఏళ్లు వెన‌క్కు వెళ్లింది, రాబోయేది టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌న్న చంద్ర‌బాబు

ఆధార్ జారీకి 180 రోజులు?

ఆధార్ కోసం తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలపై డాటా క్వాలిటీ చెక్స్ నిర్వహిస్తారు. అనంతరం, సర్వీస్‌ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్‌ కు పంపిస్తారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తయ్యాక క్లియరెన్స్ వచ్చిన 180 రోజుల్లోపు ఆధార్ జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనలన్నీ 18 ఏళ్లకు పైబడి తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే. ఆధార్ కార్డు జారీ అయ్యాక సాధారణ పద్ధతుల్లోనే వివరాలను అప్‌ డేట్ చేసుకోవచ్చు.

Jagananna Videshi Vidya Deevena: జగనన్న విదేశీ విద్యాదీవెన, అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.59 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్, ఆయన ఏమన్నారంటే..