2024 భారత దేశం ఎన్నికలు: లోక్ సభ ఎన్నికల బరిలో 8,360 మంది.. 1996 తర్వాత ఇదే అత్యధికం.. వయోవృద్ధులు.. నిరక్షరాస్యులు కూడా పోటీలోనే.. పూర్తి వివరాలు ఇవిగో!
ఈ మేరకు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Newdelhi, May 24: ఏడు దఫాలలో ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Elections) ఏకంగా 8,360 మంది పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. అధికారిక వివరాల ప్రకారం.. 1996 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లోనే ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 1,874 మంది మాత్రమే పోటీ చేయగా ఇప్పుడు దాదాపు ఈ సంఖ్య నాలుగింతలకు పైగా పెరిగింది. 1952లో సగటున ఒక్కో నియోజకవర్గానికి 4.67 మంది బరిలో ఉండగా ఇప్పుడు 15.39 మంది పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీలో ఎంతమందంటే?
- 1996 లోక్ సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 13,952 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
- 2019 ఎన్నికల్లో 8,039 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఈ ఎన్నికల్లో 8,360మంది పోటీలో ఉన్నారు.
80 ఏండ్లు పైబడినవారు 11 మంది..
- ఈ లోక్ సభ ఎన్నికల్లో 80 ఏండ్ల పైబడిన వారు 11 మంది పోటీ చేస్తున్నారు.
- 25-30 ఏండ్ల మధ్య వయస్కులు 537 మంది రంగంలో ఉన్నారు.
121 మంది నిరక్షరాస్యులు
- ఇక విద్యాపరమైన అర్హతలు పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నారు.
- 359 మంది ఐదో తరగతి వరకు చదువుకున్నట్టు తెలుస్తున్నది.
- 647 మంది 8వ తరగతి వరకు చదువగా, 1,303 మంది 12వ తరగతి పాసయ్యారు.
- 1,502 మంది గ్రాడ్యుయేట్లు, 198 మంది డాక్టరేట్లు ఎన్నికల బరిలో ఉన్నారు.
Tags
2024 India elections
2024 భారత సాధారణ ఎన్నికలు
2024 భారతదేశం elections
2024 భారతదేశం ఎన్నికలు
Andhra Pradesh Election
Andhra Pradesh Election 2024
andhra pradesh elections
Andhra Pradesh Elections 2024
How to Vote
How to vote in Lok Sabha Elections 2024
How to vote India
How to Vote Telugu
Lok Sabha Election 2024
Lok Sabha Elections 2024
Telangana Election
Telangana Election 2024
telangana elections
telangana elections 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు
తెలంగాణ ఎన్నికలు
భారత సార్వత్రిక ఎన్నికల జాబితా
భారతదేశం ఎన్నికలు
భారతదేశం ఎన్నికలు 2024
భారతదేశంలో ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికలు 2024
సార్వత్రిక ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికలు 2024