Arvind Kejriwal Granted Bail: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఇవే, సుదీర్ఘంగా నిర్బంధించడమంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది.

Arvind Kejriwal (Photo Credits: X/@Gagan4344)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు బిగ్ రిలీఫ్ దొరికింది. లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది.ఈ కేసులో సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో కేజ్రీ రెండు వేర్వేరు పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 5న విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లపైనా జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేజ్రీకి షరతులతో (conditions) కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆరు నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు, ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో కేజ్రీవాల్..కండీషన్స్ ఇవే

మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ కేజ్రీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దాంతోపాటు బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ మరో పిటిషన్‌ కూడా వేశారు. ఈ రెండు పిటిషన్లపై ఈ నెల 5న విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌, అయినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి, ఎందుకంటే..

ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐ అరెస్టు చెల్లుబాటు అవుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే.. వ్యక్తి హక్కులను హరించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదని.. ఈడీ కేసులో బెయిల్‌ లభించిన వెంటనే సీబీఐ అరెస్ట్‌ చేయడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.

కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఏంటంటే..

రూ.10లక్షల బాండ్‌ సమర్పించాలి

కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దు

కేసు విచారణ కోసం ట్రయల్‌ కోర్టు ఎదుట హాజరుకావాలి

ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లకూడదు

అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయకూడదు

లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ మార్చి 21న అరెస్టు అయ్యారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. జూలై 12న ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ అరెస్ట్ చేయడంతో ఆయన తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

సీబీఐ కేజ్రీవాల్‌ని అరెస్టు చేయడాన్ని ఇన్సురెన్స్‌ అరెస్టుగా పేర్కొన్నారు. సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. మద్యం పాలసీ కేసులోని సొత్తును 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని తెలిపారు. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌ వేయడంపై సైతం అభ్యంతరం తెలిపారు. బెయిల్ కోసం ముఖ్యమంత్రి ఎప్పుడూ ట్రయల్ కోర్టును ఆశ్రయించలేదన్నారు.

తమ నేతకు బెయిల్‌ లభించడంపై ఆప్‌ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యమే గెలిచిందంటూ (Truth always triumphs).. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఎక్స్‌ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా చివరికి గెలిచేసి న్యాయమే. ఢిల్లీ బిడ్డ అరవింద్‌ కేజ్రీవాల్‌ను జైలు సంకెళ్ల నుంచి విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం’ అంటూ ఆప్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



సంబంధిత వార్తలు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్