Arvind Kejriwal Arrested (photo-PTI)

New Delhi, July 12: ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi excise policy case)లో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ (AAP National Convener)‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ (interim bail) మంజూరు చేసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం.. సీఎంకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చింది.

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ సీఎం కేజ్రీవాల్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అరవింద్‌ కేజ్రీవాల్‌ను జూన్‌ 21న తిహార్‌ జైలులోనే సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తరువాత కోర్టు మూడురోజుల కస్టడీకి ఇచ్చింది. మళ్లీ జూన్‌ 29న ఆయనను సీబీఐ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, మనీష్ సిసోడియా, కవితల జ్యుడిషియల్ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు

ఆ తర్వాత మరోమారు ఈ నెల 12 వరకూ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు పొడిగించింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్‌ జైలులో సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఈ 'CBI కేసులో బెయిల్ మంజూరు అయితే తప్ప ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు.

Here's News

కాగా ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు గత నెల 20న బెయిల్‌ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్‌ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్‌ బిందు తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. అయితే, ట్రయల్‌ కోర్టు తీర్పును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు గత నెల 21న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

2021-22 సంబంధించిన మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్‌ 2న తిరిగి కోర్టులో లొంగిపోయారు. వైద్యపరమైన కారణాలతో ఏడువారాల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరగా.. జూన్‌ 5న ట్రయల్‌ కోర్టు తిరస్కరించింది. తాజాగా రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.