Manish Sisodia and BRS leader K. Kavitha (Photo-Facebook)

New Delhi, July 3:  ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా, BRS నాయకురాలు కె. కవితల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వారి కస్టడీని పొడిగించారు.  ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌ నివాసంలో ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత కస్టడీని పలుమార్లు పొడిగించింది. మరోవైపు బెయిల్‌ కోసం ఆమె చేస్తున్న అభ్యర్థనలను న్యాయస్థానాలు తోసిపుచ్చుతూ వస్తున్నాయి.