Atal Tunnel: ఇకపై అటల్ టన్నెల్‌గా రోహతాంగ్ టన్నెల్, హిమాచల్‌ను లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లతో కలుపుతున్న అటల్ టన్నెల్, వాజపేయి జయంతి సందర్భంగా అటల్ భూజల్ యోజనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

రోహ్‌తాంగ్ మార్గాన్ని ఇకపై అటల్ టన్నెల్‌గా(Atal Tunnel) పిలవనున్నారు. ఈ సొరంగాన్ని అటల్ జీకి అంకితం చేసిన సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ హిమాచల్‌ను లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లతో కలిపే కారిడార్‌ను ఇకపై 'అటల్ టన్నెల్' అని పిలుస్తారని అన్నారు.

PM Narendra Modi pays tribute to Atal Bihari Vajpayee (Photo Credits: PIB)

New Delhi, December 25: అటల్ బిహారీ వాజపేయి 95 వ జయంతి (Atal Bihari Vajpayee Birthday) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) రోహ్‌తాంగ్ కారిడాన్‌ను ఆయనకు అంకితం చేశారు. రోహ్‌తాంగ్ మార్గాన్ని ఇకపై అటల్ టన్నెల్‌గా(Atal Tunnel) పిలవనున్నారు. ఈ సొరంగాన్ని అటల్ జీకి అంకితం చేసిన సందర్భంగా పీఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ హిమాచల్‌ను లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లతో కలిపే కారిడార్‌ను ఇకపై 'అటల్ టన్నెల్' అని పిలుస్తారని అన్నారు. కాగా రోహ్‌తాంగ్ సొరంగానికి (Rohtang tunnel)వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన విషయం విదితమే.

ఈ రోజు దేశానికి చాలా ముఖ్యమైన ఒక ప్రాజెక్ట్ అటల్ జీకి అంకితం చేయబడింది. రోహ్‌తాంగ్ టన్నెల్ హిమాచల్ ప్రదేశ్ ను లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్లతో కలుపుతూ, మనాలిని లేహ్‌తో కలుపుకుంటూ పోతుంది. దీన్ని ఇక నుంచి అటల్ టన్నెల్ అని పిలువబడుతుంది "అని పిఎమ్ మోడీ ఈ మార్గానికి కొత్త పేరు ప్రకటించిన తరువాత తెలిపారు.

Here PM's tweet:

దీంతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉదయం మరో కీలక పథకాన్ని ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకల సందర్భంగా 'అటల్ భూజల్ యోజన'కు(Atal Bhujal Yojana) ఆయన శ్రీకారం చుట్టారు. దేశంలోని భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంతో వాజ్ పేయి ఎంతో తపించారని, ఆయన కోరిక తన కలగా మిగిలిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన మోడీ, ఈ పథకానికి తక్షణమే రూ. 6 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

నీటి లభ్యత తక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలకు పథకం మేలు కలిగిస్తుందని తెలిపారు. ఇకపై గ్రామ పంచాయితీ స్థాయిలోనే, తమతమ గ్రామాల పరిధిలో భూగర్భ జలాలను ఎలా పెంచుకోవాలన్న అంశంపై చర్చించి, నిర్ణయానికి రావచ్చని, భూగర్భ జలాలను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని మోడీ తెలిపారు.