'Bharat Bachao' Rally: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, రాహుల్ గాంధీ, రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై సారీ చెప్పే ప్రసక్తే లేదు, వాళ్లే క్షమాపణ చెప్పే రోజు వస్తుంది, భారత్ బచావో ర్యాలీలో బీజేపీపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా (Rape in India) వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది.
New Delhi, December 14: భారత్ బచావో ర్యాలీలో(Bharat Bachao Rally) కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరిగారు. బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. 'భారత్ బచావో' ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. 'రేప్ ఇన్ ఇండియా (Rape in India) వ్యాఖ్యలపై నేను క్షమాపణ చెప్పాలని నిన్న పార్లమెంటులో బీజేపీ డిమాండ్ చేసింది.
చెప్పిన నిజాలపై నేను ఎన్నడూ క్షమాపణలు కోరను. నా పేరు రాహుల్ సావర్కర్ కాదు.. నా పేరు రాహుల్ గాంధీ' (My name is not Rahul Savarkar. My name is Rahul Gandhi)అని వ్యాఖ్యానించారు.తాను నిజాలు నిర్భయంగా మాట్లాడతానని.. అందుకు ఎన్నటికీ క్షమాపణ చెప్పబోనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
ఈ నేపథ్యంలోనే తన పేరు రాహుల్ సావర్కర్ కాదని... రాహుల్ గాంధీ అంటూ బీజేపీ విమర్శలను తిప్పికొట్టారు. 'మోడీ వల్ల దేశం చాలా నష్టపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైంది. కిలో ఉల్లి ధర రూ.200కు చేరింది. నల్లధనం నిర్మూలన పేరిట అందరి జేబుల్లోని డబ్బులను మోదీ తీసుకున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చాలా నష్టపోయాం. నేడు జీడీపీ వృద్ధి రేటు 4 శాతంగా ఉంది.
Update by ANI
బీజేపీ తీసుకుంటోన్న చర్యలు ఏ మాత్రం ఫలించట్లేదు. దేశంలో మోడీ అశాంతికి కారణమవుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
నేను క్షమాపణ చెప్పడం కాదు... ఏదో ఒకరోజు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా జాతిని క్షమాపణ కోరే సమయం వస్తుంది. అందుకు కారణాలు నేను చెబుతాను. మోడీ విధానాలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతోంది. పేదల వద్ద దోచుకుని అంబానీ, అదానీలకు ఆయన దోచిపెడుతున్నారు. ప్రధాని మోడీ వారికి 25 పెద్ద కాంట్రాక్టులు ఇచ్చారు. దేశంలో కిలో ఉల్లి ధర రూ. 200 ఐనా పట్టించుకోవడం లేదు’ అని కేంద్ర సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ స్థానిక రామ్‌లీలా మైదానంలో శనివారం భారత్ బచావో ర్యాలీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, రైతు సమస్యలు, లైంగిక దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తదితరులు పాల్గొన్నారు.