CAA Row-Vijay Goel: సైకిల్‌పై ఢిల్లీ రోడ్ల మీద బీజేపీ ‘శ్రీమంతుడు’, దేశాన్ని కలుషితం చేయవద్దన్న విజయ్ గోయెల్, సీఏఏ బ్యానర్ కట్టుకుని సైకిల్‌పై పార్లమెంట్‌కి వచ్చిన బీజేపీ ఎంపీ
బిజెపి రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ (BJP lawmaker Vijay Goel) శుక్రవారం పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చారు. బడ్జెట్ సమావేశానికి ఆయన సైకిల్‌పై ఓ ప్లకార్డుతో వచ్చారు. ఇందులో "సిఎఎపై పర్యావరణాన్ని కలుషితం చేయవద్దు" (Don't Pollute the Environment On CAA) అనే స్లోగన్ రాసుకున్నారు.సైకిల్‌కి (Cycle) ఈ కార్డు కట్టుకుని ఢిల్లీ రోడ్ల మీద తొక్కుకుంటూ పార్లమెంటుకు వచ్చారు. ఈ సీన్ అచ్చం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తలపించింది. కాగా అడపాదడపా ఎంపీలు సైకిల్‌పై పార్లమెంటుకు రావడం కొత్త కానప్పటికీ విజయ్ గోయెల్ ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
New Delhi, January 31: బిజెపి రాజ్యసభ ఎంపీ విజయ్ గోయెల్ (BJP lawmaker Vijay Goel) శుక్రవారం పార్లమెంటుకు సైకిల్‌పై వచ్చారు. బడ్జెట్ సమావేశానికి ఆయన సైకిల్‌పై ఓ ప్లకార్డుతో వచ్చారు. ఇందులో "సిఎఎపై పర్యావరణాన్ని కలుషితం చేయవద్దు" (Don't Pollute the Environment On CAA) అనే స్లోగన్ రాసుకున్నారు.సైకిల్‌కి (Cycle) ఈ కార్డు కట్టుకుని ఢిల్లీ రోడ్ల మీద తొక్కుకుంటూ పార్లమెంటుకు వచ్చారు.
ఈ సీన్ అచ్చం మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని తలపించింది. కాగా అడపాదడపా ఎంపీలు సైకిల్‌పై పార్లమెంటుకు రావడం కొత్త కానప్పటికీ విజయ్ గోయెల్ ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
మీరు చేసే పనులతో 'దేశ వాతావరణం కలుషితమవుతోంది. అన్ని విపక్షాలతో చర్చించిన తర్వాతే సీఏఏ (Citizenship Amendment Act (CAA) చట్టం తెచ్చాం. అయినప్పటికీ కొందరు వ్యక్తులు రోడ్లపై రాజకీయాలు చేస్తున్నారు. దేశ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని నేను వారికి చెప్పదలుచుకున్నాను' అని తన సైకిల్ జర్నీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఇందులో భాగంగానే 'కేంద్ర పౌరసత్వ చట్టంపై వాతావరణాన్ని కలుషితం చేయవద్దు' అని రాసి ఉన్న బ్యానర్‌ను సైకిల్‌కు తగిలించి పార్లమెంటుకు వచ్చానని తెలిపారు. సీసీఏ, ప్రతిపాదిత ఎన్ఆర్‌సీకి (National Registrar of Citizens (NRC) వ్యతిరేకంగా విపక్షాల నేతలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగిన కొద్దిసేపటికే విజయ్ గోయల్ తాజా వ్యాఖ్యలు చేశారు.
Here's VIjay Goel Tweet
ఇదిలా ఉంటే ప్రతిపక్ష నాయకులు "సేవ్ ఇండియా", "సేవ్ కాన్‌స్టిట్యూషన్" (Save India, Save Constitution) మరియు "నో టు సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి" అనే పలకలను తీసుకొని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా "ద్వేషపూరిత రాజకీయాలను ఆపు" (Stop the politics of hate) మరియు "సేవ్ అవర్ డెమోక్రసీ" (Save Our Democracy) అంటూ పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు.
పరిస్థితులు ఎలా ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైనది
"సిఎఎ మరియు ఎన్ఆర్సి దేశ ప్రజలలో విభజన మరియు ద్వేషాన్ని సృష్టిస్తాయి మరియు మన ప్రజాస్వామ్యానికి మరియు లౌకికవాదానికి అపాయం కలిగిస్తాయి. అందువల్ల సిఎఎను రద్దు చేయాలని మేము డిమాండ్ చేసాము" అని కాంగ్రెస్ తెలిపింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)