New Delhi, January 31: ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) 2020-21 కేంద్ర బడ్జెట్‌ను (Union Budget 2020-21) ప్రవేశపెట్టబోతుండటంతో, దేశం మొత్తం వారి 'లెక్కల పద్దు' పై ఎన్నో ఆకాంక్షలతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలో సుమారు 60 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులు గల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ ( ShareChat), దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎలాంటి అంచనాలతో ఉన్నారు, ఈ బడ్జెట్ ద్వారా వారేం ఆశిస్తున్నారో తెలుసుకునేందుకు దేశవ్యాప్త సర్వేను చేపట్టింది. ఆ సర్వే ప్రకారం ఎక్కువ మంది మూడు అంశాలపై తమ ఆకాంక్షలను వెలిబుచ్చారు. అవి ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మినహాయింపులు, ఉపాధి అవకాశాల పెంపు మరియు నిత్యావసర ధరలు తగ్గించడం ప్రధానంగా ఉన్నాయి.
ఆరు భాషల్లో షేర్‌చాట్ చేపట్టిన సర్వే యొక్క డేటాను క్రోడికరించి విశ్లేషిస్తే, చాలా మంది భారతీయులు ప్రప్రథమంగా ఆదాయపు పన్ను స్లాబ్‌ను సంస్కరించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతున్నారు. రెండవది నిరుద్యోగం. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ బడ్జెట్ పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మందగమనం కారణంగా దేశంలో చాలా మంది నిరుద్యోగులయ్యారు. ఈ కారణంగా కేంద్ర బడ్జెట్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా ఉండాలని వారు కోరుకుంటున్నారు. ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైనది.- రాష్ట్రపతి
ఇక మరో ప్రధాన ఆకాంక్ష, నిత్యావసర ధరల్లో తగ్గుదల. ఇటీవల మార్కెట్లో కూరగాయల ధరలు, ముఖ్యంగా ఉల్లి ధరలు ఆకాశన్నంటాయి. సామాన్య ప్రజల సంపాదన మొత్తం తిండికే సరిపోవట్లేదు. ఈ కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించేలా చొరవ తీసుకోవాలని అని కోరుకున్నారు.
షేర్‌చాట్ క్రోడీకరించిన ప్రజాభిప్రాయ సేకరణ డేటా మరియు ప్రజల ఆకాంక్షలు
భాష | మొత్తం వీక్షకుల సంఖ్య (మిలియన్లలో) | యూజర్ల ఎంగేజ్మెంట్ | వాట్సాప్ షేర్స్ | యూజర్ల ఆకాంక్షలు |
హిందీ | 6 | 1,00,000 | 20,000 | ఎ) జీఎస్టీని తగ్గించాలి
బి) మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి సి) తక్కువ ఆదాయ పన్ను రేట్లు |
తమిళం | 2 | 80,000 | 22,000 | ఎ) నిత్యావసర ధరల పెరుగుదల నియంత్రణ.
బి) ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. సి) దేశంలో ఆర్థిక మందగమనానికి పరిష్కారం చూపాలి. |
పంజాబీ | 2 | 40,000 | 12,000 | ఎ) జీఎస్టీని తగ్గించాలి
బి) రైతాంగానికి చేయూత; రైతులకు రుణ మాఫీ |
మరాఠీ | 1 | 23,000 | 4,000 | ఎ) సామాన్యులకు మరియు రైతులకు తోడ్పాటుగా బడ్జెట్ ఉండాలి
బి) ఆరోగ్యం, విద్య మరియు వ్యవసాయంపై బడ్జెట్ ఎక్కువ దృష్టి పెట్టాలి సి) 5 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా ఉండాలి d) చిరు వ్యాపారులకు తోడ్పాటును మరియు ఉపాధిని పెంచండి ఇ) బాలికల విద్య మరియు భద్రత |
బెంగాలీ | 0.8 | 15,000 | 2,300 | ఎ) నిత్యావసర ధరల తగ్గుదల
బి) ఆదాయపు పన్ను స్లాబ్లను విస్తరించాలి |
కన్నడ | 1 | 22,000 | 1,800 | ఎ) ఆదాయపు పన్ను, బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించాలి
బి) మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి |
వీటితో పాటు మరెన్నో అంశాలపై దేశ ప్రజలు ఆశలు పెట్టుకొని, తమ అభిప్రాయాలను వెల్లడించారు. కేంద్ర బడ్జెట్ నుండి ప్రజలు ఆశిస్తున్న ఇతర వాటిల్లో జీఎస్టి తగ్గింపు, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు మరియు మహిళల భద్రతను పెంచడం తదితరమైనవి ఉన్నాయి. 2020 జనవరి 28 (ఉదయం 10) నుండి జనవరి 30, 2020 (ఉదయం 10) వరకు చేపట్టిన సర్వే ద్వారా ఈ డేటాను సేకరించినట్లు షేర్‌చాట్ తెలిపింది. గత రెండు రోజులలో 80,000 కి పైగా వాట్సాప్ లో షేర్ చేయబడిన సందేశాల డేటాను విశ్లేషించినట్లు వెల్లడించింది.