Pradhan Mantri Kisan Samman Nidhi: పీఎం కిసాన్‌ నిధుల్లో కోత, రూ.75 వేల కోట్ల నుంచి రూ.61 వేల కోట్లకు ఈ బడ్జెట్‌ను పరిమితం చేసే అవకాశం, బడ్జెట్ 2020లో రైతులకు మరో రెండు కీలక పథకాలు!
Union Budget 2020: Govt may trim PM-KISAN allocation by 20% to Rs 60k crore and may launch two mega schemes for farmers | (Photo-PTI)

New Delhi, January 31: రేపు యూనియన్ బడ్జెట్ (Union Budget 2020) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని రంగాల మీద అంచనాలు మొదలయ్యాయి. కొన్ని రంగాల్లో కోతలు, మరికొన్ని రంగాలు పెరుగదలలు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పీఎం కిసాన్ (Pradhan Mantri Kisan Samman Nidhi)నిధుల కేటాయింపుల్లో కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బడ్జెట్ పట్ల కోటి ఆశలు

కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ యోజన (PM-KISAN)కేటాయింపుల్లో 20 శాతం కోతపెట్టి రూ.60,000 కోట్లకు పరిమితం చేసే అవకాశం ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

2019-20 బడ్జెట్లో ఈ పథకానికి రూ.75,000 కోట్లు కేటాయించింది. అందులోభాగంగా, రైతులకు ఏటా రూ.6,000 చొప్పున మూడు దఫాల్లో అందజేసింది. అయితే, సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో పీఎం కిసాన్‌ పథకానికి కేటాయింపులు రూ.61,000 కోట్లకు తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

పరిస్థితులు ఎలా ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠమైనది

పశ్చిమ బెంగాల్‌తోపాటు కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయకపోవడం, మరికొన్ని రాష్ట్రాల వద్ద రైతులకు సంబంధించిన వివరాలు లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ పథక లబ్దిదారులైన రైతుల సంఖ్య గతంలో అంచనా వేసిన 14.5 కోట్ల నుంచి 14 కోట్లకు తగ్గింది. దీంతో 2020-21 బడ్జెట్లోనూ మోదీ ప్రభుత్వం ఈ పథకానికి కేటాయింపులను రూ.61 వేల కోట్లకే పరిమితం చేయవచ్చని సమాచారం. దీంతో పాటుగా రైతులకు నరేంద్ర మోదీ సర్కారు (PM Modi Sarkar) తీపికబురు అందించేందుకు సిధ్దమైనట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ 2020లో రైతుల కోసం (Farmers) రెండు కీలక పథకాలను (Two Mega Initiatives) ఆవిష్కరించే అవకాశముందని సమాచారం.

పథకాల విషయానికి వస్తే.. వీటిల్లో ఒకటి కార్ప్ డైవర్సిఫికేషన్ (corp diversification) సంబంధించిన స్కీమ్ కాగా, మరొకటి ఎఫ్‌పీవో (Farmer Producer Organisations (FPOs)ఏర్పాటుకు ఆర్థిక సాయం అందించే పథకం కేంద్రం గత బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీవో) ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌పీవో కార్యక్రమానికి రూ.7,000 కోట్లు కేటాయించే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని వల్ల 10 వేల వరకు ఎఫ్‌పీవోల ఏర్పాటు సాధ్యం కావొచ్చు.

ఎఫ్‌పీవోల్లోని చిన్న, సన్నకారు రైతుల గ్రూప్‌‌లు రైతుల ఆదాయం పెరుగుదలకు సాయం అందిస్తారు. వ్యవసాయ మంత్రత్వి శాఖ ఎఫ్‌పీవోలకు నిధులకు సమకూరుస్తుంది. అలాగే ఇతరత్రా అవసరమైన వాటిని అందిస్తుంది. ఇంకా ఏమైనా టెక్నాలజీ పరమైన అవసరాలు ఉంటే.. వాటికి కూడా తీరుస్తుంది. ఎఫ్‌పీవోలు బిజినెస్ యూనిట్లుగా పనిచేస్తాయి.

కేంద్ర ప్రభుత్వం కార్ప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్‌ విషయానికి వస్తే.. ఇది భిన్నమైన భిన్నమైన పంటలకు సంబంధించినది. దీని కోసం ప్రభుత్వం రూ.500 నుంచి రూ.600 కోట్లు కేటాయించే ఛాన్స్ ఉంది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తున్న ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకురావొచ్చని అంచనా. నేలను సారవంతంగా మార్చడం, వ్యవసాయ-పర్యావరణ సమతుల్యత అనే అంశాలు ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలుగా ఉండనున్నాయి.