COVID-19 'Politics' in Bihar: రాజకీయాలను తాకిన కరోనావైరస్, బీహార్ సీఎం వెంటనే రాజీనామా చేయాలి, వలస కార్మికులను రక్షించడంలో విఫలమయ్యారు, విమర్శలు గుప్పించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
బీహార్ రాష్ట్రంలోని (Bihar State) వలస కార్మికులను రక్షించడంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) దారుణంగా విఫలమయ్యారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) విమర్శలు గుప్పించారు. ట్విటర్‌ను వేదికగా ’ప్రభుత్వ వైఫల్యాన్ని చూపే హృదయ విదారకర ఘటన’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
Patna, Mar 30: దేశ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదిపేసిన మహ్మమారి కోవిడ్ 19నా వైరస్ చివరికి రాజకీయాలను (COVID-19 'Politics' in Bihar) కూడా తాకింది. బీహార్ రాష్ట్రంలోని (Bihar State) వలస కార్మికులను రక్షించడంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar) దారుణంగా విఫలమయ్యారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) విమర్శలు గుప్పించారు. ట్విటర్‌ను వేదికగా ’ప్రభుత్వ వైఫల్యాన్ని చూపే హృదయ విదారకర ఘటన’ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.
21రోజుల తర్వాత లాక్‌డౌన్ పొడిగింపు అంతా పుకారు
ఈ వీడియోలో వలస కూలీలు ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటిపర్యంతవుతున్నారు. ప్రభుత్వం నుంచి తామకు ఏమీ అవసరంలేదని, తమ స్వస్థలాలకు పంపిస్తే చాలని విలపిస్తున్నారు. కనీన సామాజిక దూరం పాటించలన్న నిబంధనలు ఉల్లంఘించి... అందరినీ ఒకే గదిలో బందించినట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో తినడానికి తిండి కూడా లేక కాలేకడుపుతో అలమటిస్తున్నారు.
Here's Prashant Kishor Tweet
అ క్రమంలోనే వివిధ ప్రాంతాలను నుంచి బిహార్‌కు వలస వచ్చిన కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. ప్రజలెవ్వరూ రాష్ట్రాల సరిహద్దులు దాటరాదన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కార్మికులందరినీ క్వారెంటెన్ కేంద్రాలకు పంపించారు.
లాక్‌డౌన్‌ను ఎదుర్కొవడంలో నితీష్ తీవ్రంగా విఫలమయ్యారని, అంతిమంగా పొట్టకూటి కోసం దేశ నలుమూలల నుంచి బిహార్‌కు వచ్చిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రశాంత్ కిషోర్ నితీష్‌పై ధ్వజమెత్తారు. అంతేకాకుండా తన వైఫల్యాలను అంగీకరించి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వలస కూలీలను ఎక్కడికక్కడే ఆపేయండి
ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ను కూడా ప్రశాంత్ కిషోర్ వ్యతిరేకించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోసం పలు రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని దుయ్యబట్టారు. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోలేకపోతున్నారని, కరోనా వైరస్ సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో ఎదుర్కోలేపోతోందని అభిప్రాయపడ్డారు. కాగా వైరస్ విపత్తు నుంచి ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ప్రశాంత్ స్వాగతించారు.