#WhereIsKCR: సీఎం కేసీఆర్ ఎక్కడ? తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ సీఎం జాడ ఏదంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నలు, ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రగతి భవన్‌లో కొన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేశారు. మంత్రి కేటీఆర్ మినహా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ ప్రగతి భవన్ విడిచి రెండు, మూడు రోజుల క్రితమే మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని ఫాంహౌజ్‌కు...
Hyderabad, July 5: తెలంగాణలో గత కొన్నిరోజులుగా కొవిడ్19 విజృంభిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో లాక్డౌన్ విధిస్తారా? లేదా? కరోనావైరస్ కట్టడికి ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు? టెస్టుల సామర్థ్యం పెంచుతారా లేదా అంటూ ట్విట్టర్లో నెటిజన్లు తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ తో వేల సంఖ్యలో ట్వీట్స్ వచ్చిపడుతున్నాయి. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్ ఈరోజు ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగడం చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్‌లో కరోనావైరస్ ఉగ్రరూపం, ఒక్కరోజులో 1500పైగా కేసులు
అయితే ఈ హ్యాష్‌ట్యాగ్ పాలిటిక్స్ కేటగిరిలో ట్రెండ్ అవుతోంది, చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు, నేతలు మరియు పార్టీల కార్యకర్తలు #WhereIsKCR హ్యాష్‌ట్యాగ్‌కు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు.
Twitter trends on WhereIsKCR:
Take look at this tweet:
సీఎం పరిపాలన భవనమైన ప్రగతి భవన్‌లో కూడా సుమారు 30 మంది వరకు కరోనా బారినపడ్డారు. సీఎం భద్రతా విభాగంలో కూడా కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రగతి భవన్‌లో కొన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేశారు. మంత్రి కేటీఆర్ మినహా సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ ప్రగతి భవన్ విడిచి రెండు, మూడు రోజుల క్రితమే మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలోని ఫాంహౌజ్‌కు తరలివెల్లినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుండగా పట్టించుకోకుండా సీఎం నగరాన్ని విడిచి వెళ్లడం ఏంటంటూ 'పొలిటికల్' కోణంలో ట్విట్టర్లో ప్రశ్నలు సంధిస్తున్నారు.
మరోవైపు హైదరాబాద్ లో మళ్ళీ లాక్డౌన్ విధిస్తారనే ఊహాగానాల నేపథ్యంలో చాలా మంది నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లారని ఒక అంచనా అంటూ మీడియా కథనాలు వెలువడ్డాయి.