Kejriwal Ka Guarantee Card: ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ వరాల జల్లులు,‘కేజ్రీవాల్ కా గ్యారెంటీ కార్డు’ను ఆవిష్కరించిన ఆప్ అధినేత, అధికారంలోకి వస్తే ఉచిత ఇల్లు, ఉచిత బస్సు సౌకర్యం, 24 గంటల తాగునీరు..,ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal)రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ‘ కేజ్రీవాల్ కా గ్యారెంటీ కార్డు’ను (Kejriwal ka Guarantee Card)ఆవిష్కరించారు. ఈమేనిఫెస్టోలో(AAP Manifesto) ఢిల్లీ ప్రజలకు వరాలు జల్లులు కురిపించారు.
New Delhi, January 19: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal)రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ‘ కేజ్రీవాల్ కా గ్యారెంటీ కార్డు’ను (Kejriwal ka Guarantee Card)ఆవిష్కరించారు. ఈమేనిఫెస్టోలో(AAP Manifesto) ఢిల్లీ ప్రజలకు వరాలు జల్లులు కురిపించారు.
వచ్చే ఐదు సంవత్సరాలు కరెంటు, 24 గంటలు తాగే నీరు, ఇల్లు, ఇంటర్ వరకు విద్య, వైద్యం ప్రయాణం, పారిశుద్ధ్యాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. నిరుపేదలకు ఉచితంగా ఇల్లు కట్టిస్తాం. విద్యార్థులు, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఎన్ఎస్ఏ నీడలో ఢిల్లీ, ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన కేజ్రీవాల్.. విద్యార్థులకు కూడా ఆ పథకాన్ని వర్తించే విధంగా రూపకల్పన చేశారు. ప్రతి చిన్నారికీ ప్రపంచ స్థాయి ఉచిత విద్య, ఢిల్లీ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన వాతావరణం, కాలుష్యం నియంత్రణ, క్లీన్ యమునా, వైద్య, ఆరోగ్యంలో కీలక సంస్కరణలు మరికొన్ని ప్రజాకర్షణ పథకాలతో కూడిన మేనిఫెస్టోను కేజ్రీవాల్ ఆదివారం విడుదల చేశారు.
Here's Kejriwal Ka Guarantee Card
మరోసారి తమకు అధికారం అప్పగిస్తే.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ఢిల్లీలోని(Delhi) మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరుగనుంది.
ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం:అమిత్ షా
అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections 2020) సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ (Congress Party) 54 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించింది. అందులో కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్ పటేల్ నగర్ నుంచి, ఆప్ నుంచి హస్తం గూటికి చేరిన అల్కా లాంబా చండీ చౌక్ నుంచి పోటీ చేయనున్నారు.
అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ ఎన్నికలకు బీజేపీ భారీ ప్లాన్‌తో బరిలోకి దిగుతోంది. రానున్న 20 రోజుల్లో 5 వేల ర్యాలీలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఢిల్లీ బీజేపీలోని(BJP) టాప్ 100 మంది నేతలు రోజుకు సుమారు నాలుగు ర్యాలీలు నిర్వహించేలా, ప్రతి ర్యాలీకి 200 మందిలోపే ప్రజలు హాజరయ్యేలా ప్రణాళిక రచించింది.
Read the ANI Tweet Below
రెండో సారి అధికారంలోకి వచ్చేందుకు ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ప్రచార పర్వంలో తన భార్య, కూతురు కూడా దూసుకుపోతున్నారు. కేజ్రీవాల్ భార్య సునీత, అతని కుమార్తె హర్షిత శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన తండ్రికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని హర్షిత ఓటర్లును కోరుతున్నారు.
కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్
దేశ రాజధాని కావడంతో ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా హస్తినలో అధికారానికి దూరంగా ఉన్న.. కమళనాధులు విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చూస్తున్నారు. ఇక గత వైభవం కోసం హస్తం పార్టీ నేతలు కృషి చేస్తున్నారు.
BJP workers hold protest outside party office
అరవింద్ కేజ్రీవాల్ 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఏకంగా 67 స్థానాల్లో విజయం సాధించి చరిత్రలో నిలిచారు. అంతకుముందు ఏకదాటిగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఒక్కస్థానం కూడా గెలవలేకపోయింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ తీవ్ర పరాజయం పాలైంది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సారి బీజేపీ అసెంబ్లీలో కూడా పాగా వేయాలని పట్టుదలతో ఉంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)