Delhi Assembly Elections 2020: ఢిల్లీలో నేడు పోలింగ్, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్, రికార్డు స్థాయి ఓటింగ్ నమోదు చేయాలన్న ప్రధాని మోడీ, మహిళలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
పోలింగ్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) (Election Commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రణ్‌బీర్ సింగ్ వెల్లడించారు.
New Delhi, February 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు (Delhi Assembly Elections 2020 Polling) సర్వం సిద్ధమైంది. పోలింగ్‌కు ఎన్నికల సంఘం(ఈసీ) (Election Commission) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రణ్‌బీర్ సింగ్ వెల్లడించారు.
ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్
పౌరసత్వ సవరణ చట్టంపై షహీన్‌బాగ్‌లో నిరసనలు, జేఎన్‌యూలో హింస వంటి ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఈ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 75 వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ను బందోబస్తు కోసం వినియోగించుకుంటున్నట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీర్ రంజన్ వెల్లడించారు.
ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ
ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. ఓటర్లను గుర్తించడానికి ఎన్నికల సిబ్బంది క్యూఆర్ కోడ్స్, మొబైల్ యాప్స్‌ని (Mobile Apps) వాడుతున్నారు. ఓటర్లు స్మార్ట్ ఫోన్‌లను వెంట తెచ్చుకోవడానికి కూడా అనుమతినిచ్చారు. ఓటరు కార్డు లేకపోయినా క్యూ ఆర్ కోడ్‌తో స్కాన్ చేసి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తారు.
అలాగే షహీన్‌బాగ్‌లో నిరసనకారుల్ని ఎన్నికల సిబ్బంది స్వయంగా కలుసుకొని ఓటు వేయాలని కోరారు. ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలిరావడానికి వీలుగా ఉదయం 4 గంటల నుంచే మెట్రో రైళ్లు నడవనున్నాయి.
దీంతో పాటుగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న 30 నియోజకవర్గాల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచే కార్యక్రమాలను ఈసీ (EC) చేపట్టింది. ఓటర్లను(Voters) పోలింగ్ బూత్‌లకు ఉచితంగా చేరవేస్తామని టూవీలర్ ట్యాక్సీ సేవల సంస్థ ఇప్పటికే ర్యాపిడో ప్రకటించింది. మూడు కిలోమీటర్ల వరకు ఓటర్ల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమని తెలిపింది.
నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని
ఓటర్లు బయటకు వచ్చి ఓటు వేయమని విజ్ఞప్తి చేయడానికి ప్రధానితో పాటు పలువురు నాయకులు ట్విట్టర్‌లోకి వెళ్లారు. "Delhi ప్రజలను, ముఖ్యంగా నా యువ స్నేహితులను రికార్డు సంఖ్యలో ఓటు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు" అని ప్రధాని (PM Modi) ట్వీట్ చేశారు.
Here's the tweet by PM Modi:
ఢిల్లీ ఎన్నికలలో మహిళలు ఓటు వేయాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) కోరారు, తమ ఇంటిలాగే దేశం కూడా తమ బాధ్యత అని అన్నారు. హిందీలో ఒక ట్వీట్‌లో, ఓటింగ్ కోసం వారు తమ ఇళ్లలోని పురుషులను కూడా తీసుకెళ్లాలని అన్నారు. "దయచేసి బయటకు వెళ్లి ఓటు వేయండి. మహిళలందరికీ ప్రత్యేక విజ్ఞప్తి - మీరు మీ ఇళ్ల బాధ్యతను స్వీకరించినట్లే, దేశం మరియు ఢిల్లీ పట్ల బాధ్యత కూడా మీ భుజాలపై ఉందని ట్వీట్ చేశారు.
Here's the tweet by Arvind Kejriwal:
ఈ రోజు పోలింగ్ రోజున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఓటర్లను అభ్యర్థించారు. ఢిల్లీకి స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడం ద్వారా బిజెపి దూరదృష్టితో కూడిన ఆలోచనతో, బలమైన ఉద్దేశాలతో ఉన్న ప్రభుత్వం అని షా అన్నారు. "Delhiని అబద్ధాలు మరియు ఓటుబ్యాంక్ రాజకీయాల నుండి విడిపించేందుకు ఓటు వేయాలని నేను ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని షా అన్నారు.
Here's the tweet by Amit Shah:
ఇదీ లెక్క
మొత్తం స్థానాలు: 70
మొత్తం ఓటర్లు: 1.47 కోట్లు
బరిలో ఉన్న అభ్యర్థులు: 672
పోలింగ్ బూత్‌లు: 13, 750