DMK Mega Rally At Chennai: డిఎంకే మెగా ర్యాలీ, పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసనలు, ర్యాలీకి అనుమతిని నిరాకరించిన పోలీసులు, ర్యాలీ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించాలన్న మద్రాసు హైకోర్టు

ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ఎండీఎంకే అధినేత వైగోతో పాటు పలువురు పాల్గొన్నారు.

DMK and its alliance parties hold a 'mega rally' against Citizenship Amendment Act, in Chennai(Photo-ANI)

Chennai,December 23: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తమిళనాడులోని(Tamil Nadu) డిఎంకె మరియు దాని మిత్రపక్షాలు (DMK and its alliance parties ) చెన్నైలో (Chennai) మెగా ర్యాలీని ప్రారంభించాయి. ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత పి. చిదంబరం, ఎండీఎంకే అధినేత వైగోతో పాటు పలువురు పాల్గొన్నారు.

ర్యాలీలో డీఎంకే, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నార్సీ, సీఏఏ.. రాజ్యాంగ విరుద్ధమని డీఎంకే కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే డీఎంకే ర్యాలీకి (mega rally) పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.

నా దిష్టి బొమ్మలు కాల్చండి..అంతేకాని ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకండి , సీఏఏపై ప్రజల తీర్పును గౌరవించండి : ప్రధాని మోడీ 

ఆందోళన నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా సోమవారం ఆందోళన చేపట్టనున్నట్లు డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించిన సంగతి విదితమే. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాగా ఈ ర్యాలీ వ్యవహారం ఇప్పుడు మద్రాసు హైకోర్టుకు చేరింది.

Mega rally At Chennai

స్టాలిన్ ర్యాలీకి వ్యతిరేకంగా నిన్న హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ర్యాలీపై ఎలాంటి స్టే విధించలేదు. అయితే ఒకవేళ స్టాలిన్‌ ర్యాలీ చేపడితే అదంతా వీడియోలో చిత్రీకరించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నేడు ర్యాలీని రికార్డ్‌ చేస్తున్నారు.