Sanjay Raut Cryptic Tweet: ఫస్ట్ మందిర్, తరువాత సర్కార్, శివసేన లీడర్ సంజయ్ రౌత్ ఆసక్తికర ట్వీట్, ‘మహా’లో తేలని పంచాయితీ, హోటల్ రీట్రీట్‌కు శివసేన ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతు అవసరం లేదన్న శివసేన

దశాబ్దాల నుంచి సాగుతూ వస్తున్న వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు (Ayodhya verdict) వెల్లడించింది. ఈ క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ (Shiv Sena Leader Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

First Temple, then Maharashtra government: Shiv Sena Leader Sanjay Raut posts cryptic tweet after Ayodhya verdict(Photo-ANI)

Mumbai, November 9: దశాబ్దాల నుంచి సాగుతూ వస్తున్న వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు స్థల వివాదంపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు (Ayodhya verdict) వెల్లడించింది. ఈ క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ (Shiv Sena Leader Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందు మందిర్‌.. ఆ తర్వాత ప్రభుత్వం..అయోధ్యలో ఆలయం మహారాష్ట్రలో ప్రభుత్వం అంటూ ట్విట్టర్‌లో ట్వీట్‌ (Sanjay Raut Cryptic Tweet) చేశారు. ఈ ట్వీట్ వెనుక అర్థం ఏమై ఉంటుదనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా మహారాష్ట్రలో అధికార పంపకంపై బీజేపీ, శివసేనల మధ్య పంచాయితీ తేలకపోవడంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటు(Maharashtra government)లో జాప్యం ఏర్పడిన సంగతి తెలిసిందే.

చెరి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలన్న శివసేన ప్రతిపాదనకు బీజేపీ ససేమిరా అనడంతో ఇరు పార్టీలూ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు.

శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

శివసేనకు సహకరిస్తామని ఎన్సీపీ సంకేతాలు పంపినా కాంగ్రెస్‌ పార్టీ విముఖతతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. మరోవైపు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చొరవచూపడం లేదు. ఇక ప్రస్తుత అసెంబ్లీకి నేటితో గడువు తీరడంతో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్‌ ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే శివసేన ఎమ్మెల్యేలను మాలద్‌ వెస్ట్‌లోని మధ్‌లో ఉన్న హొటల్‌ రిట్రీట్‌కు తరలించారు. ఈ నెల 15వ తేదీ వరకూ వారు అక్కడ ఉంటారు. వారికి తగిన రక్షణ కల్పించాలంటూ శివసేన పార్టీ ముంబై పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాసింది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేయడం, అనంతరం మీడియా సమావేశంలో శివసేనపై ఫడ్నవిస్ విరుచుకుపడిన నేపథ్యంలో శివసేన ఘాటుగా స్పందించింది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు, శివసేన నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ తెలిపారు. ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా, కొనసాగుతున్న శివసేన-బీజేపీ పంచాయితీ

ముఖ్యమంత్రి పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలనే ఒప్పందం ఏదీ జరగలేదంటూ ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునేందుకు ఉద్ధవ్ థాకరే, బీజేపీ మధ్య ఒప్పందం జరిగిందని ఆయన మరోసారి కుండబద్ధలు కొట్టారు. అయితే ఆ ఒప్పందం ఖరారైనప్పుడు బీజేపీ నేత నితిన్ గడ్కరి లేరని చెప్పారు.  అయోధ్యలో రామ‌మందిర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా ఎదురుదాడికి దిగారు. 50-50 ఫార్ములాపై హామీ ఇచ్చి మాట తప్పారని బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే విరుచుకుపడ్డారు. సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షానే మాటిచ్చారని అబద్ధాలకోరులతో ఇకపై మాటల్లేవ్ అని స్పష్టం చేశారు. తమతో కలిసేందుకు ఎవరు ముందుకొచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Aramgarh Flyover: హైదరాబాద్‌ నగరంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఆరాంఘర్‌- జూపార్క్‌ ఫ్లై ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Anchor Forget CM Revanth Reddy Name: సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయిన హీరో, కిరణ్‌కుమార్‌ అంటూ స్టేజి మీదకు ఆహ్వానించడంతో ఒక్కసారిగా గందరగోళం

CM Revanth Reddy: ఇది ఆర్ధిక సాయం కాదు…ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సివిల్స్ ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ. లక్ష ప్రోత్సాహం, సివిల్స్‌లో మనవాళ్లే రాణించాలన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

Share Now