Gujarat Election Result 2022: ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచాం, గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారని తెలిపిన ప్రధాని మోదీ, పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని

ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామన్నారు. గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తు విజయాలకు సంకేతమన్నారు.

PM Modi (Photo-ANI)

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...కేంద్రమంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌ తో కలిసి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయం సాధించడంతో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రధాని మోదీ ఈ సంబరాల్లో పాల్గొన్నారు.

గుజరాత్ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ నేత ఉరేసుకుని ఆత్మాహత్యాయత్నం, ఈవీఎంలు సరిగా లేవని నిరసన

ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. పార్టీ మద్దతుదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదం వల్లే మళ్లీ గెలిచామన్నారు. గుజరాత్‌ ప్రజలు బీజేపీవైపేనని నిరూపించారన్నారు. బీజేపీ కార్యకర్తల కష్టానికి ఫలితం కనిపిస్తుందని తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌, బిహార్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు భవిష్యత్తు విజయాలకు సంకేతమన్నారు. హిమాచల్‌లో ఒక శాతం ఓట్లే గెలుపోటములను డిసైడ్‌ చేశాయని తెలిపారు. హిమాచల్‌ అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతృత్వాన్ని మెచ్చుకున్నారు. యూపీ రాంపూర్‌లో బీజేపీ అభ్యర్థి గెలిచారని చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఒక్క పోలింగ్ బూత్‌లో కూడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారని మోదీ చెప్పారు.

గుజరాత్ బీజేపీ అడ్డా రుజువు చేసిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం, ఈ నెల 12న సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణం

భారత్ అమృత్‌కాలంలో ప్రవేశించిన తరుణంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు ద్వారా బీజేపీని ఆదరించారని మోదీ చెప్పారు. బీజేపీ దేశం కోసం కఠినమైన, పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. బంధుప్రీతి, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని చెప్పారు. గుజరాత్‌ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి బీజేపీకి చారిత్రక విజయం అందించారని మోదీ చెప్పారు.

జాతి, కుల, మతాలకు అతీతంగా బీజేపీకి ఓట్లు వేశారని చెప్పారు. భరోసా కలగడం వల్లే యువత బీజేపీకి ఓట్లేసిందని మోదీ చెప్పారు. విజన్‌తో పాటు, వికాసం కూడా సాధించగలిగే శక్తి సామర్థ్యాలుండటం వల్లే యువత బీజేపీకి ఓట్లేసిందన్నారు. దేశానికి క్లిష్టమైన సవాళ్లు ఎదురైతే పరిష్కారం కోసం దేశ ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని మోదీ చెప్పారు. దేశమే తొలి ప్రాధాన్యమనే సంకల్పంతో బీజేపీ పనిచేస్తుందని మోదీ చెప్పారు. మహిళలు, దళితులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేశారన్నారు.