Haryana Election results 2019: కీలకంగా మారనున్న స్వతంత్రులు, సీఎం సీటు రేసులో దుష్యంత్ చౌహాలా, ఆచితూచి అడుగులు వేస్తున్న బీజేపీ, జేజేపీకి సీఎం సీటు ఇవ్వడానికి సై అంటున్న కాంగ్రెస్
హర్యానా ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. కర్ణాటక రాజీకీయాలను ఫాలో అవుతూ తీర్పును అందించాడు. అధికారంలోకి మేమే వస్తామనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీ జేజేపీ చుక్కలు చూపించింది.
Chandigarh,October 24: హర్యానాలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలు సరికొత్త మలుపుతో సాగుతున్నాయి. హర్యానా ఓటరు ఈ సారి ఏ పార్టీకి పూర్తి మెజారీటీని అందివ్వలేదు. కర్ణాటక రాజీకీయాలను ఫాలో అవుతూ తీర్పును అందించాడు. అధికారంలోకి మేమే వస్తామనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చిన్న పార్టీ జేజేపీ చుక్కలు చూపించింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నాయకుడు దుష్యంత్ సింగ్ చౌతాలా అనూహ్యంగా సీఎం రేసులోకి దూసుకొచ్చాడు. అయితే ఆయన్ను సీఎం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుండగా బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.
స్వతంత్రులను తమ వైపు తిప్పుకుని అధికారం కోసం అవసరమైన సంఖ్యా బలాన్ని సాధించుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ మాత్రం విభిన్నంగా ఆలోచిస్తోంది. జేజేపీకి సీఎం సీటు ఇవ్వడానికి ముందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్రలో కాషాయం కూటమి రెపరెపలు
కాగా ఎన్నికల ఫలితాలు ముగిసే నాటికి స్వతంత్రులు కీలకం అవుతారా లేదా జేజేపీ పార్టీ కింగ్ మేకర్ గా ఉంటుందా అనేది ఇప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉంటే దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ విజయం ఖాయమని చెప్పాయి. అయితే ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. హర్యానాలో మళ్లీ కర్ణాటక సీన్
పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం: జేజేపీ
హర్యానాలో ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీకి సీఎం పదవిని ఆఫర్ చేస్తూ బీజేపీకి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. మరోవైపు జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను కాషాయ నేతలు పంజాబ్ మాజీ సీఎం, అకాలీదళ్ చీఫ్ ప్రకాష్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు అప్పగించింది.
బీజేపీ స్వతంత్రులను లాక్కోవాలని చూస్తోంది: కాంగ్రెస్
అలాగే స్వతంత్రులతో మాట్లాడి వారిని ఆకర్షించేందుకు పార్టీ సీనియర్లు రంగంలోకి దిగారు. 90 మంది సభ్యులతో కూడిన హర్యానాలో అసెంబ్లీలో బీజేపీ 38 స్ధానాల్లో కాంగ్రెస్ 32 స్ధానాల్లో ఇతరులు 19 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. వీరిలో జేజేపీ 11 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. కాగా, హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం. రసవత్తరంగా మారిన హర్యానా
చేతిలో ఉన్నవి 11 సీట్లే అయినా.. కర్ణాటకలో కుమారస్వామి తరహాలో ఆ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 38 స్థానాల్లో ఆధిక్యం సాధించిన బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజార్టీకి మరో ఏడు స్థానాల దూరంలో ఉంది.
32 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో 11 స్థానాలతో మూడో స్థానంలో ఉన్న జేజేపీకి కాంగ్రెస్ సీఎం పదవిని ఆఫర్ చేసింది. ఇప్పుడు అక్కడ స్వతంత్రులు కీలకంగా మారారు. 10 సీట్లలో స్వతంత్రులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇండిపెండెంట్లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తుంది.
బీజేపీ మెజారిటీ కోల్పోయే పరిస్థితి కనిపిస్తుండడంతో ప్రత్యర్థి పార్టీలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నాయి. 75 పైగా స్థానాల్లో విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేసిన బీజేపీ సీఎం అభ్యర్థి మనోహర్ లాల్ ఖట్టార్‌పై జేజేపీ చీఫ్ దుశ్యంత్ చౌతాలా సెటైర్లు వేశారు. ‘‘హర్యానా ప్రజలు మా పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మార్పునకు సంకేతం. 75 సీట్లు దాటాలనుకున్న బీజేపీ లక్ష్యం ఎలాగూ విఫలమైంది. ఇప్పుడు వాళ్లు కనీసం యుమనా నదినైనా దాటాలి...’’ అని ఆయన వ్యాఖ్యానించారు.