Hemant Soren:జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్, ఈ నెల 29న ప్రమాణ స్వీకారం, హాజరవ్వనున్న ప్రముఖులు, బీజేపీని మట్టికరిపించి 47 స్థానాల్లో విజయం సాధించిన జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి
ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో పాటు టిఎంసి నాయకులు హాజరు అవుతారని తృణమూల్ సీనియర్ నాయకులు మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీతో హేమంత్ సోరెన్‌తో మంచి సంబంధాలను నెరుపుతామని పేర్కొన్నారు.
Ranchi, December 28: జార్ఖండ్ ముక్తి మోర్చా (Jharkhand Mukti Morcha)పార్టీ నాయకులు హేమంత్ సోరెన్(Hemant Soren) ఈ నెల 29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీతో పాటు టిఎంసి నాయకులు హాజరు అవుతారని తృణమూల్ సీనియర్ నాయకులు మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీతో హేమంత్ సోరెన్‌తో మంచి సంబంధాలను నెరుపుతామని పేర్కొన్నారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో హేమంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం(Hemant Soren Swearing-in Ceremony) జరగనుంది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, (Sonia Gandhi)ఆ పార్టీ ఎంపి రాహుల్ గాంధీని (Rahul Gandhi)హేమంత్ సోరెన్ కోరారు. 81 స్థానాల జార్ఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించి.. బిజెపి ని మట్టి కరిపించింది. బిజెపి 25, ఇతరులు 9 స్థానాల్లో గెలుపొందారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. విపక్ష నేతలంతా పెద్ద ఎత్తున హాజరు కానున్నా నేపధ్యంలో అందరి దృష్టి జార్ఖండ్ వైపు మళ్లింది.
జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం అవసరమైన స్పష్టమైన మెజార్టీ సాధించింది. రాష్ట్రంలో మొత్తం 81 స్థానాలకు గాను ఈ కూటమి 47 స్థానాల్లో విజయం సాధించింది. అధికార బీజేపీ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. ఓటమి అనంతరం ముఖ్యమంత్రి పదవికి రఘుబర్ దాస్ రాజీనామా చేశారు. సాక్షాత్తూ సీఎం రఘుబర్ దాస్ ఓడిపోవడం బీజేపీ పరాభవానికి అద్దం పడుతోంది. ఇక జేవీఎం 2, ఏజేఎస్‌యూ 2, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. జార్ఖండ్ అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 41 కాగా జేఎంఎం కూటమి మెజారిటీకి అవసరమైన స్థానాల కంటే 6 సీట్లను అధికంగా గెలుచుకుంది.
జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ తాను పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు ఏజేఎస్‌యూతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాషాయం పార్టీ ఈసారి సీట్ల పంపకాల విషయంలో పొరపొచ్చాల కారణంగా ఒంటరిగా బరిలో దిగింది. ఇదే సమయంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా పోటీ చేయడం కలిసొచ్చింది. ఈ పార్టీలు వరసగా 43, 31, 7 స్థానాల్లో పోటీ చేశాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలను తలదన్ని జేఎంఎం భారీ విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.