Ranchi, December 23: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు (Assembly Election Results 2019)బీజేపీకి షాకిచ్చాయి. జార్ఖండ్ ప్రజలు అధికారంలో ఉన్న ఆ పార్టీని కాదని జెఎంఎం-కాంగ్రెస్ కూటమి(Cong-JMM) వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. జెఎంఎం-కాంగ్రెస్ కూటమి కార్యకర్తుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షా అక్కడ ప్రచారం నిర్వహించినప్పటికీ బీజేపీ(BJP) వైపు ప్రజలు ఆసక్తి చూపలేదు.
ఈ ఫలితాలపై హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా స్పందించారు. జార్ఖండ్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇదే సందర్భంలో గత ఎన్నికల్లో మాకు అధికారాన్ని అందించిన ప్రజలకు రుణపడి ఉన్నామని వారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతాపార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.
Here's Tweet
Union Home Minister & BJP leader Amit Shah tweets, "We respect the mandate given by the people of #Jharkhand. We express our gratitude towards them for giving us the opportunity to serve them for 5 years. BJP is committed towards continuous development in the state". pic.twitter.com/DbOjC3vEFG
— ANI (@ANI) December 23, 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi), హోంమంత్రి అమిత్ షా (Amit shah) ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక్కొక్కరు తొమ్మిదేసి ర్యాలీల్లో పాల్గొంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయిదు, ప్రియాంక గాంధీ ఒక్క ర్యాలీలో పాల్గొన్నారు.
జార్ఖండ్ తరువాతి ముఖ్యమంత్రిగా రేసులో ఉన్న హేమంత్ సోరెన్ (Hemanth soren) ఫలితాలపై జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) (Jharkhand Mukti Morcha (JMM))దాని మిత్ర పక్షాలు భారీ విజయం వైపుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు (Jharkhand Assembly Elections Results 2019)చూసిన తరువాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
తన నివాసంలో మీడియా వ్యక్తులను ఉద్దేశించి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మాకు అవకాశం ఇచ్చిన జార్ఖండ్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని జెఎంఎం చీఫ్ అన్నారు. ఎవరి ఆశలను దెబ్బతీయమని హేమంత్ అన్నారు.
ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో.. హేమంత్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ప్రస్తుత సీఎం రఘుబర్‌దాస్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు ఓటమి అంచుల్లో ఉన్నారు. జార్ఖండ్ ఫలితాలను స్వాగతిస్తున్నట్లు ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపారు. నాన్ బీజేపీ పార్టీలకు ప్రజలు మద్దతు పలికారన్నారు.