JMM Leader Hemant soren: జార్ఖండ్‌లో కొత్త అధ్యాయం మొదలైంది, ఈ విజయం ప్రజలకు అంకితమన్న హేమంత్ సోరెన్, సైకిల్ తొక్కుతూ హుషారుగా.., సీఎంగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత
అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) (Jharkhand Mukti Morcha (JMM))దాని మిత్ర పక్షాలు భారీ విజయం వైపుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు (Jharkhand Assembly Elections Results 2019)చూసిన తరువాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Ranchi, December 23: ఎన్నికల తరువాత జార్ఖండ్ తరువాతి ముఖ్యమంత్రిగా రేసులో ఉన్న హేమంత్ సోరెన్ (Hemanth soren) ఫలితాలపై జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) (Jharkhand Mukti Morcha (JMM))దాని మిత్ర పక్షాలు భారీ విజయం వైపుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు (Jharkhand Assembly Elections Results 2019)చూసిన తరువాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
తన నివాసంలో మీడియా వ్యక్తులను ఉద్దేశించి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ.. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మాకు అవకాశం ఇచ్చిన జార్ఖండ్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని జెఎంఎం చీఫ్ అన్నారు. ఎవరి ఆశలను దెబ్బతీయమని హేమంత్ అన్నారు.
Here'S ANI Tweet
తమ గెలుపు విషయంలో తోడ్పడ్డవారికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు. తనపై విశ్వాసం ఉంచిన లాలూ, సోనియా, రాహుల్, ప్రియాంకాలకు హేమంత్ థ్యాంక్స్ చెప్పారు. ఫలితాలు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో.. హేమంత్ తన నివాసంలో హుషారుగా సైకిల్ తొక్కుతూ కనిపించారు.
హుషారుగా సైకిల్ తొక్కుతూ ...
ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో.. హేమంత్ నేతృత్వంలోని జేఎంఎం పార్టీ ఆధిక్యంలో ఉన్నది. ప్రస్తుత సీఎం రఘుబర్‌దాస్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు ఓటమి అంచుల్లో ఉన్నారు. జార్ఖండ్ ఫలితాలను స్వాగతిస్తున్నట్లు ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపారు. నాన్ బీజేపీ పార్టీలకు ప్రజలు మద్దతు పలికారన్నారు.
Here's Sharad Pawar voice
ఈ ఏడాది హర్యానా, మహారాష్ట్రతో పాటు జార్ఖండ్‌లో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు కాంగ్రెస్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్‌తో కలిసి రావాలన్నారు. హేమంత్ సోరెన్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంగ్రాట్స్ చెప్పారు.