Prime Minister Narendra Modi with Home minister Amit Shah. (Photo: PTI/File)

Ranchi, December 23: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాలు (Assembly Election Results 2019) బీజేపీకి ఘోర పరాభవాన్ని మిగిల్చేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో 37 స్థానాలను కైవసం చేసుకున్న భారతీయ జనతాపార్టీ (BJP)ఈ సారి 25 స్థానాలకే పరిమితం అయ్యేలా ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్-జేఎంఎం కూటమి భారీ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీపై శివసేన, ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

తాజాగా అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్-జేఎంఎం కూటమి (Cong-JMM) 46 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. బీజేపీ 25 స్థానాల్లో, జేవీఎమ్ 3 స్థానాల్లో ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. ప్రధాని మోడీ (PM Modia), హోమంత్రి అమిత్ షాలకు (Amit Shah) ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరోసారి టార్గెట్ చేసిన శివసేన

మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన బీజేపీకి ఈరోజు వెలువడుతున్న ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చిన నేపథ్యంలో బీజేపీని శివసేన (Shiv Sena) మరోసారి టార్గెట్ చేసింది. పౌరసత్వ సవరణ చట్టంతో బీజేపీకి ఒరిగిందేమీ లేదని... ఆ పార్టీ మరో రాష్ట్రాన్ని కోల్పోయిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.

ఝార్ఖండ్ ను బీజేపీ ఐదేళ్లు పాలించిందని మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు సర్వశక్తులను ఒడ్డారని చెప్పారు. మోడీ పేరు చెప్పుకుని ఓట్లను రాబట్టుకునేందుకు యత్నించిన బీజేపీ బోర్లా పడిందని అన్నారు. మహారాష్ట్ర ఓటమి తర్వాత ఝార్ఖండ్ ను కూడా ఎందుకు కోల్పోవాల్సి వచ్చిందో బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు.

ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలకు జార్ఖండ్‌ ప్రజలు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ అన్నారు. ‘మోడీ, అమిత్‌షాల గర్వాన్ని జార్ఖండ్‌ ప్రజలు తుడిచిపెట్టేశారు. ప్రజాస్వామ్యం గెలిచింద’ని ఆయన ట్వీట్‌ చేశారు.

తండ్రి కొడుకుల ఆనంద హేల

సీఎంగా సోరెన్

అధికారికంగా కూటమి విజయం గురించి ఎన్నికల కమిషన్ ప్రకటించడానికి మరికొన్ని గంటల సమయం ఉన్నప్పటికే ఇప్పటికే తమ విజయం ఖారారైందని కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎంగా సోరెన్ ప్రమాణస్వీకారం ఎప్పుడు ఉంటుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు. సీఎం గా సోరెన్ ప్రమాణస్వీకారంతో దేశంలోనే అత్యంత తక్కువ వయస్సులో సీఎం అయిన వ్యక్తిగా నిలవనున్నారు. 2013 జులై నుంచి 2014 డిసెంబర్ వరకు జార్ఖండ్ సీఎంగా ఇప్పటికే హేమంత్ సోరెన్ బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే.

జోరుగా హుషారుగా..

తండ్రిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న హేమంత్ సోరెన్

పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM)పార్టీ చీఫ్ హేమంత్ సోర్ తన తండ్రి,మాజీ సీఎం సిబు సోరెన్ ను రాంచీలోని ఆయన నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. జార్ఖండ్ ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో తండ్రిని కలిసి హేమంత్ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఓ సైకిల్ తొక్కుతూ సరదాగా కన్పించారు. ఇంటి ఆవరణలో హుఉషారుగా సైకిల్ తొక్కుతూ విజయాన్ని ఆస్వాదిస్తూ కన్పించారు. ఇప్పటికే కూటమి సీఎం అభ్యర్థిగా హేమంత్ సోరెన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.