National Party Status: దేశంలో ఎన్ని పార్టీలకు ఇప్పుడు జాతీయ హోదా ఉంది, అసలు జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావాల్సిన అర్హతలు ఏమిటి ?

అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా (national party status) ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి?

Election Commission of India. (Photo Credit: Twitter)

New Delhi, April 11: సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం (Election Commission) రద్దు చేసిన సంగతి విదితమే. అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా (national party status) ఇచ్చింది.అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి ఉండాలి? అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ విషయాలపై కథనం ఇస్తున్నాం ఓ సారి తెలుసుకోండి.

ఈసీ కీలక నిర్ణయం, సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీ పార్టీలకు జాతీయ హోదా రద్దు, ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పిస్తూ ప్రకటన

ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. అంటే అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలిచి ఉండాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగిఉండాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి. వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది.

బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ.. ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు నిరాశ.. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ నిర్ణయం

ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు మాత్రమే జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. వీటిల్లో కాంగ్రెస్, బీజేపీ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉనికిని కలిగి ఉన్నాయి. ఇక 2012లో వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. మొన్నటి గుజరాత్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపింది.

ఇక 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. తాజాగా ఆ పార్టీ తన గుర్తింపును కోల్పోయింది. మరో పార్టీ టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. 2004లో రాష్ట్ర పార్టీ హోదా, 2016లో జాతీయ పార్టీ హోదా పొందింది. తాజాగా ఇది కూడా జాతీయ హోదా కోల్పోయింది. జాతీయ హోదా కోల్పోయిన మరో పార్టీ ఎన్సీపీ 1999 లో ఏర్పాటయింది. కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చిన శరద్‌పవార్‌ దీన్ని స్థాపించారు. 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది.తాజాగా ఆ హోదా కోల్పోయింది.



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు