BRS Status In AP: బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ.. ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు నిరాశ.. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ నిర్ణయం
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది.
Hyderabad, April 11: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ (BRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ-EC) తీసుకున్న తాజా నిర్ణయం పెద్ద షాక్ ఇచ్చింది. అసలేమైందంటే.. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో కీలక మార్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా (State Status) ఉపసంహరించింది. ఈసీ తాజా నిర్ణయంతో ఆ పార్టీకి నిరాశ తప్పలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు?
రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే... ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు కానీ, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లు కానీ సాధించాల్సి ఉంటుంది. అటు, 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చి ఉండాలి. ఈ లెక్కన చూస్తే... ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ ప్రకటనలో వెల్లడించింది.
ఆ పార్టీలకు కూడా షాక్
ఇక, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్ లో ఆర్ ఎస్పీలకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది. అటు, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీకి, త్రిపురలో తిప్రా మోతా పార్టీ, నాగాలాండ్ లో జనశక్తి పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపునిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ ఈ మేరకు నిర్ణయించింది.
(The above story first appeared on LatestLY on Apr 11, 2023 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

