![](https://test1.latestly.com/wp-content/uploads/2023/04/29-Image-380x214.jpg)
కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలకు జాతీయ పార్టీ హోదా రద్దు చేసింది. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా కల్పించింది. ఈ మేరకు ఈసీ నుంచి ప్రకటన వెలువడింది. మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ పార్టీకి, శరద్ పవార్ ఆధ్వర్యంలో నడిచే ఎన్సీపీకి ఈసీ నిర్ణయం షాకింగ్ పరిణామమే.
ఇక, ఆప్ విషయానికొస్తే ఢిల్లీలో నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించుకుంటూ పోతోంది. పంజాబ్ లోనూ అధికార పీఠం చేజిక్కించుకున్న ఆప్... మరికొన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. గతేడాది జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించి ఉనికిని చాటుకుంది.